Rappa Rappa Fight Scene : ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ రిలీజయ్యి నెలలు గడుస్తున్నా, ఇంకా పుష్పరాజ్ మేనియా తగ్గట్లేదు. నిన్నటికి నిన్న ఓ స్పోర్ట్స్ స్టేడియంలో ‘పుష్ప 2’ సినిమాలోని ‘ఫీలింగ్స్’ (Peelings Song) పాటకి చీర్ గర్ల్స్ డాన్స్ చేసి అదరగొట్టారు. ఇక ఇప్పుడు ఏకంగా రెజ్లింగ్ లో కూడా ‘పుష్ప 2’ మూవీలోని రప్ప రప్ప ఫైట్ చేసి దుమ్మురేపారు రెజ్లర్స్. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. మరి ఇంతకీ ఈ రెజ్లింగ్ ఫైట్ ఎక్కడ జరిగింది? రెజ్లింగ్ కి, పుష్ప 2 సినిమాకి లింక్ ఏంటి? అనే వివరాల్లోకి వెళ్తే…
రెజ్లింగ్ లో రప్ప రప్ప ఫైట్
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పాన్ ఇండియా మూవీ ‘పుష్ప 2’. డిసెంబర్ 5న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. దాదాపు 1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. ఇందులో ఎక్కువగా బాలీవుడ్ నుంచి వచ్చిన కలెక్షన్లే ఉండడం విశేషం. నార్త్ ఆడియన్స్ పుష్పరాజ్ కు అంతగా అడిక్ట్ అయ్యారు మరి.
ఇక సినిమాలో చెప్పుకోవలసిన అంశాలు తక్కువే అయినప్పటికీ, జనాలపై ఎఫెక్ట్ మాత్రం గట్టిగానే పడింది. దీంతో ‘పుష్ప 2’ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఆ సినిమాలోని పాటలకు రీల్స్ చేయడం దగ్గర నుంచి మొదలు పెడితే, పుష్పరాజ్ గెటప్ వరకు ఎక్కడ చూసినా అదే హడావుడి కనిపిస్తోంది. తాజాగా ఏకంగా ఏఈడబ్ల్యూ – ఆల్ ఎలైట్ రెజ్లింగ్ ఫైట్ (AEW – all elite wrestling) కూడా అచ్చం ‘పుష్ప 2’ మూవీలో ఉన్నట్టే కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ అభిమానులు ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, పుష్ప రాజ్ ఎఫెక్ట్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఆ వీడియోలో అచ్చం ‘పుష్ప 2’ మూవీలో అల్లు అర్జున్ చేతులు, కాళ్లు కట్టేసి ఉన్నప్పటికీ ఫైట్ చేసినట్టుగానే రెజ్లింగ్ లో కూడా ఈ వీరులు ఫైట్ చేశారు.
పూనకాలు తెప్పించిన రప్ప రప్ప ఫైట్
‘పుష్ప 2’ మూవీలో పూనకాలు తెప్పించే సీన్లు రెండే రెండు ఉన్నాయి. అందులో ఒకటి జాతర ఫైట్ సీన్. ఇక ఆ తర్వాత పుష్పరాజ్ అన్న కూతురిని ఎత్తుకెళ్లినప్పుడు, హీరో విలన్లని వేటాడే హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్. ఆ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ కాళ్ళు, చేతులు కట్టేసి ఉన్నప్పటికీ, అమ్మవారు పూనడంతో ఆయన్ని ఎవ్వరూ ఆపలేక పోతారు. ఇక అల్లు అర్జున్ ఆ సీన్లో చేసిన ఫైట్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించింది. అచ్చం అలాంటిదే రెజ్లింగ్ ఫైట్ లో జరగడంతో రప్ప రప్ప ఫైట్స్ చూసి, పుష్పగాడి ఇంటర్నేషనల్ అప్ప అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి ఈ ఫైట్ చూసి కొందరు లాజిక్కేది అని పెదవి విరిచారు. కానీ ఇప్పుడు రెజ్లర్స్ అచ్చం అలాంటి ఫైట్ తో విమర్శకుల కళ్ళు తెరిపించారు.
Rappa Rappa fight in WWE 💥🔥#AlluArjun #Pushpa2TheRule pic.twitter.com/Ryt49vS5ar
— HomelAAnder (@bhaanu_18) March 6, 2025