BigTV English

IPL Tickets Scam: SRH ఫ్యాన్స్‌ కు షాక్‌.. ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్ !

IPL Tickets Scam: SRH ఫ్యాన్స్‌ కు షాక్‌.. ఐపీఎల్ టికెట్స్ సోల్డ్ ఔట్ !

IPL Tickets Scam: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025.. 18వ సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సొంత మైదానంలో తమ అభిమాన క్రికెటర్ల ఆటను చూసి ఆస్వాదించాలనే ఫ్యాన్స్ కోరికను కొంతమంది క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. ఐపీఎల్ 2025 సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో నిర్వహించబోయే మ్యాచ్లకు సంబంధించి టికెట్ల దందా జోరుగా సాగుతోంది.


Also Read: Harmanpreet Kaur: WPLలో తన్నుకున్న లేడీ క్రికెటర్లు.. వేలు పెట్టి మరీ హర్మన్‌ రచ్చ !

హెచ్సీఏ లో మళ్లీ ఐపీఎల్ టికెట్స్ దందా మొదలైంది. ఈ సీజన్ కి సంబంధించిన టికెట్స్ బుకింగ్స్ లోను మళ్ళీ అదే తీరు కనిపిస్తోంది. ఆన్ లైన్ లో అందుబాటులోకి తెచ్చిన టికెట్స్ ని కొన్ని నిమిషాలలోనే బ్లాక్ చేశారు. తక్కువ ధరలో ఉన్న టికెట్స్ మొత్తాన్ని సోల్డ్ అవుట్ చేసేసారు. నేటి నుండి ఐపీఎల్ టికెట్ల అమ్మకాలు స్టార్ట్ చేసినట్లు సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తెలిపిన విషయం తెలిసిందే. జొమాటో కు చెందిన డిస్ట్రిక్ట్ యాప్ లో ఈ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చింది.


అంతేకాకుండా ప్రతి రెండు టికెట్లకు గాను ఒక జెర్సీని బహుమతిగా ఇవ్వనునట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా ఈ స్ట్రెటజీని ఫ్రాంచైజీ ఫాలో అవుతూ వస్తుంది. ఈ సీజన్ లో మార్చి 23న ఉప్పల్ వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్ – రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య పోరు జరగనుంది. అలాగే 27న లక్నోతో తెలపడనుంది ఆరెంజ్ ఆర్మీ. ఉప్పల్ మైదానంలో జరగబోతున్న ఈ రెండు మ్యాచ్లకు సంబంధించిన టికెట్స్ నేడు అందుబాటులోకి వచ్చాయి.

నేడు ఉదయం 11 గంటలకు ఈ టికెట్స్ సేల్ షురూ అయింది. అభిమానులు టికెట్ల కోసం INDISTRICCT వెబ్ సైట్ ని ఓపెన్ చేశారు. కానీ సేల్ షురూ అయ్యాక కొద్ది నిమిషాలకే సైట్ సోల్డ్ అవుట్ గా చూపిస్తోంది. కేవలం 10, 21 వేల రూపాయల టికెట్లు మాత్రమే బుకింగ్ కి అందుబాటులో ఉన్నాయి. తక్కువ ధరగా ఉన్న 700 టికెట్లు మాత్రం బ్లాక్ లేదా సోల్డ్ అవుట్ అని చూపిస్తోంది. దీంతో హైదరాబాద్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఐపీఎల్ టికెట్ల విషయంలో ఎలాంటి అవకతవకలకు అవకాశం ఇవ్వనని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలిపినప్పటికీ.. సాధారణ క్రీడాభిమానులకు మాత్రం నిరాశ ఎదురవుతుంది.

Also Read: Wiaan Mulder – Carse: SRH కు బిగ్ షాక్.. డేంజర్ ప్లేయర్ దూరం…!

ఈ టికెట్ల విషయంలో హెచ్సీఏ అధ్యక్షులు ఏం సమాధానం చెబుతారో వేచి చూడాలి. మరోవైపు ఆన్లైన్ లో టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు వీటిని ఫిజికల్ గా ఎక్కడ తీసుకోవాలో ఫ్రాంచైజీ తెలుపలేదు. దీంతో ఈ విషయంలోనూ గందరగోళం నెలకొంది. ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకున్న వారు క్యూఆర్ కోడ్ చూపించి ఫిజికల్ టికెట్ పొందాల్సిందే. ఈ ఫిజికల్ టికెట్స్ కోసం ఎల్బీ స్టేడియం, జింఖానా గ్రౌండ్స్, గచ్చిబౌలి స్టేడియంలో కౌంటర్స్ ఏర్పాటు చేస్తున్నారు.

Tags

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×