BigTV English

Alert to SBI Credit Card Holders: క్రెడిట్ కార్డుదారులకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఎంఏడీ లెక్కింపులో కొత్త పద్ధతి

Alert to SBI Credit Card Holders: క్రెడిట్ కార్డుదారులకు ఎస్‌బీఐ హెచ్చరిక.. ఎంఏడీ లెక్కింపులో కొత్త పద్ధతి

Changes In MAD counting System: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు. దీనిని ‘ప్రతి భారతీయుల భాంకర్’ అని కూడా పిలుస్తారు. 18 మిలియన్లకు పైగా క్రెడిట్ కార్డ్‌లు అమలులో ఉన్న ఈ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ జారీచేయడంలో దేశంలో రెండవ అతిపెద్ద బ్యాంక్‌గ నిలిచింది. దీంతో ఈ బ్యాంకు తన క్రెడిట్ కార్డ్ విధానంలో ఏ మార్పులు చేసినా అది పెద్ద సంఖ్యలో ప్రజలను ప్రభావితం చేస్తుంది. ఎస్‌బీఐ తాజాగా క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం చెల్లించాల్సిన కనీస మొత్తం (మినిమం అమైంట్ డ్యూ లేద ఎంఏడీ)ని ఎలా లెక్కించాలో కొన్ని మార్పులను ప్రకటించింది.


ఈ మార్పులు మార్చి 15 నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్‌బీఐ తన క్రెడిట్ కార్డ్ దారులకు ఈ మార్పులను తెలియజేస్తూ ఈమెయిల్‌లను పంపింది. 15 మార్చి 2024 నుంచి కొత్త మార్పులు అమలులోకి వస్తాయి. కనీస మొత్తం బకాయి(ఎంఏడీ) నిర్వచనం కూడా సవరించారు. అని మెయిల్‌లో పేర్కొన్నారు. వీటితో పాటు ఎంఏడీ ప్రస్తుత గణన విధానాన్ని.. దానిలో ప్రతిపాదించిన మార్పులను కూడా మెయిల్ ద్వరా పంచుకుంది.

Read More: నోట్లపై గాంధీ బొమ్మే ఎందుకు..!


ప్రస్తుత ఎంఏడీ లెక్కింపు పద్ధతి..
జీఎస్‌టీ, ఈఎంఐ మొత్తలతో కలిపి 100శాతం ఫీజు లేద ఛార్జీలు, 5శాతం ఫైనాన్స్ ఛార్జీ (ఏదైనా ఉంటే), రిటైల్ ఖర్చులు నగదు అడ్వాన్స్ (ఏదైనా ఉంటే), ఓవర్‌లిమిట్ మొత్తం (ఏదైనా ఉంటే) అన్నిటిని కలిపి ఎంఏడీగా లెక్కిస్తారు.

సవరించిన కొత్త ఎండీఏ పద్ధతి..
ఈ సవరించిన కొత్త పద్ధతిలోను జీఎస్‌టీ, ఈఎంఐ మొత్తలతో కలిపి 100శాతం ఫీజు లేద ఛార్జీలు, 5శాతం ఫైనాన్స్ ఛార్జీ (ఏదైనా ఉంటే), రిటైల్ ఖర్చులు నగదు అడ్వాన్స్ (ఏదైనా ఉంటే), ఓవర్‌లిమిట్ మొత్తం (ఏదైనా ఉంటే) అన్నిటిని కలిపి ఎంఏడీగా లెక్కిస్తారు. కానీ

లెక్కింపు పద్ధతి రెండు ఒకే విధంగా అనిపించినప్పటికి.. ఫైనాన్స్ ఛార్జీల కంటే 5శాతం మొత్తం తక్కువగా ఉన్న సందర్భాలలో ప్రధాన మార్పులు ఉంటాయి. ‘ఫైనాన్స్ ఛార్జీల కంటే 5శాతం (ఫైనాన్స్ ఛార్జ్, రిటైల్ ఖర్చులు, నగదు అడ్వాన్స్ మొత్తం కలిపి) తక్కువగా ఉంటే.. ఎంఏడీ లెక్కింపు మొత్తం జీఎస్‌టీ, ఈఎంఐ మొత్తలతో కలిపి 100శాతం ఫీజు లేద ఛార్జీలు, 100శాతం ఫైనాన్స్ ఛార్జీ ఓవర్‌లిమిట్ మొత్తం ( ఏదైనా ఉంటే) కలిపి లెక్కిస్తారు అని ఎస్‌బీఐ బ్యాంక్ తన మెయిల్‌లో పేర్కొంది.

ఈ కొత్త సవరన పద్ధతి బిల్లు మొత్తాన్ని ప్రభావితం చేయనప్పటికీ, చెల్లించాల్సిన కనీస మొత్తం కొంత వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇది తుది బిల్లులో అదనపు మొత్తాన్ని జోడించనందున ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్ దారులకు ఇబ్బందులు ఉండకపోవచ్చు.

Tags

Related News

RBI New Rules: RBI కొత్త రూల్స్..! ఆ ఖాతాలకు సెటిల్‌మెంట్‌కి 15 రోజుల గడువు

Credit Score: సిబిల్ స్కోర్ అంటే ఏంటి? లోన్ ఇవ్వాలా వద్దా అని బ్యాంకు ఎలా నిర్ణయిస్తుంది ?

Bank Holidays: ఈ వారంలో 4 రోజులు బ్యాంకులు బంద్.. హాలిడేస్‌ లిస్ట్‌ ఇదే!

SBI Card New Rules: కార్డ్ యూజర్లకు ఎస్‌బీఐ ఝలక్.. కోటి ఆఫర్ పోయినట్టే

FMCG Sales: పండగలకు స్టాక్ పెంచిన FMCG.. సామాన్యులకు లాభమా? నష్టమా?

DMart: ఇక డి-మార్ట్ కు వెళ్లాల్సిన పని లేదు.. ఇలా చేస్తే నేరుగా ఇంటికే సరుకులు!

Big Stories

×