బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఒక్క రోజుకే 35 కోళ్లు, 90 కేజీల బియ్యం.. ఈ ఫ్యామిలీ రేషన్ లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!

ఒక్క రోజుకే 35 కోళ్లు, 90 కేజీల బియ్యం.. ఈ ఫ్యామిలీ రేషన్ లిస్ట్ చూస్తే షాక్ అవుతారు!

Largest Family : ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు ఉంటేనే సంసారం సాగించడం కష్టంగా మారుతోంది. “మా వల్ల కాదు బాబోయ్” అంటూ న్యూక్లియర్ ఫ్యామిలీల వైపు అందరూ అడుగులు వేస్తున్నారు. కానీ, భారతదేశంలోని ఒక మారుమూల గ్రామంలో మాత్రం ఒక విచిత్రమైన, అసాధారణమైన ‘మహా సామ్రాజ్యం’ నడుస్తోంది. ఒకే కుటుంబం.. ఒకే పైకప్పు.. కానీ సభ్యుల సంఖ్య వింటే మీ కళ్ళు బైర్లు కమ్మడం ఖాయం! ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 200 మంది సభ్యులు ఒకే ఇంట్లో కలిసి జీవిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద కుటుంబంగా రికార్డు క్రియేట్ చేసిన ఈ ఫ్యామిలీ స్టోరీ ఇప్పుడు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

ఏకంగా 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు

అది ..భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలోని ‘బక్తాంగ్’ (Baktawng) అనే గ్రామం.ఇక్కడ ఉండే ఈ మహా రాజ్యానికి పెద్ద  జియోనా చానా (Ziona Chana). మిజోరంలో బహుభార్యాత్వాన్ని ఆచరించే ఒక ప్రత్యేక తెగకు ఆయన నాయకుడిగా ఉండేవారు. జియోనా చానాకు ఏకంగా 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు, 33 మంది మనవడు/మనవరాళ్లు ఉన్నారు. దురదృష్టవశాత్తూ జియోనా చానా 2021లో తన 76వ ఏట కన్నుమూశారు. అయినప్పటికీ, ఆయన నిర్మించిన ఈ భారీ కుటుంబ వ్యవస్థ నేటికీ చెక్కుచెదరకుండా, అదే క్రమశిక్షణతో కొనసాగుతుండటం విశేషం.

also read :హాలీవుడ్ దిగ్గజాలకే మైండ్ బ్లాక్…స్టార్స్ లేకుండానే రూ. 2200 కోట్లా?
ఈ 200 మంది జనాభా ఎక్కడ ఉంటారు? ఏ హోటల్‌లోనో, విల్లాలోనే అనుకుంటే పొరపాటే. వీరంతా ‘న్యూ జనరేషన్ హౌస్’ (Chhuan Thar Run) అని పిలిచే ఒకే ఒక్క భారీ భవనంలో నివసిస్తున్నారు. ఇది నాలుగు అంతస్తుల భారీ భవనం. ఇందులో ఏకంగా 100 గదులు ఉన్నాయి. జియోనా చానా భార్యలందరూ ఒకే పెద్ద పడకగదిని పంచుకునేవారు. పిల్లలు, కోడళ్లకు వేర్వేరు గదులు కేటాయించారు.ఇక ఇందులో సొంతంగా స్కూల్, ఆటస్థలం, వ్యవసాయ క్షేత్రాలు, కార్పెంట్రీ వర్క్‌షాప్‌లు కూడా ఉన్నాయి.

ఒక్క పూటకే 30 నుండి 35 కోళ్లు

ఇక ఈ ఇంట్లో రోజువారీ వంట అనేది ఒక పెద్ద ఫంక్షన్ లేదా పెళ్లి లాంటిదే! సాధారణ కుటుంబానికి నెల రోజులకు సరిపోయే రేషన్.. ఈ ఇంట్లో కేవలం ఒక్క రోజులోనే ఖాళీ అయిపోతుంది. కేవలం వంటగదిని చూస్తేనే సందర్శకులు ఆశ్చర్యపోతారు. ఆ కుటుంబం ప్రతిరోజూ 45 నుండి 90 కిలోల బియ్యంతో పాటు, సుమారు 40 కిలోల బంగాళాదుంపలు, 25 కిలోల కూరగాయలు, 20 కిలోల పప్పుధాన్యాలు వండుతారని సమాచారం. ఇక మాంసాహార వంటకాల విషయానికొస్తే.. ఒక్క పూటకే 30 నుండి 35 కోళ్లు (సుమారు 60 కిలోల మాంసం) అవసరమవుతాయి.

ఇంత పెద్ద కుటుంబంలో గొడవలు రాకుండా ఎలా ఉంటారు? అనేదే అందరి ప్రశ్న. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ కుటుంబం మొత్తం మిలిటరీ తరహా క్రమశిక్షణతో నడుస్తుంది. జియోనా చానా మొదటి భార్య (అందరికంటే పెద్ద ఆవిడ) పనులన్నింటినీ పర్యవేక్షిస్తుంది. భారీ కట్టెల పొయ్యిలపై, అల్యూమినియం డ్రమ్ముల లాంటి పాత్రలలో వంట జరుగుతుంది. భార్యలందరూ షిఫ్టుల వారీగా వంట చేస్తుండగా.. కూతుళ్లు, కోడళ్లు ఇల్లు శుభ్రం చేయడం, కాయగూరలు కోయడం వంటి పనుల్లో సహాయపడతారు. మగవారంతా వ్యవసాయం, పశుపోషణ, కార్పెంట్రీ పనులు చూసుకుంటారు.

రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్

ఇక ఈ క్రేజీ బడా ఫ్యామిలీ  అంతర్జాతీయ మీడియాను సైతం ఆకర్షించిందండోయ్. ప్రపంచ ప్రసిద్ధ ‘రిప్లీస్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్’ (Ripley’s Believe It or Not) పుస్తకంలో కూడా ఈ కుటుంబం కథ పబ్లిష్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాక్యుమెంటరీ దర్శకులు, పర్యాటకులు ఈ వింత కుటుంబాన్ని, వారి వంటగదిని, వారు కలిసి జీవిస్తున్న విధానాన్ని కళ్లారా చూసేందుకు మిజోరంలోని ఈ ‘బక్తాంగ్’ గ్రామానికి క్యూ కడుతున్నారట. మరీ మీరూ ఒకసారి ఆ బడా ఫ్యామిలీని చూసొస్తారా !
also read :చిన్నపాపతో రాత్రికి రాత్రే ఇల్లు వదిలి వచ్చేసిన స్టార్ నటి.. అసలేం జరిగిందంటే?

Related News

బిర్యానీలో ఈగ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కోర్టు తీర్పు ఇదే!

జేబులో బాంబులా పేలిన స్మార్ట్‌ఫోన్.. షాకింగ్ వీడియో చూస్తే ఇక జేబులో ఫోన్ పెట్టరు!

నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఆలయ ఏనుగు వీడియో.. ఏం చేసిందంటే?

లోకల్ బస్సు ఎక్కితే.. దుబాయికి టికెట్ కొట్టాడు.. బిత్తరపోయిన ప్యాసింజర్!

ఓరేయ్ పాపిష్టోడా.. ఇదేం పనిరా.. పిల్లనిచ్చిన అత్తను పెళ్లాడిన అల్లుడు!

లక్ అంటే ఇదేనేమో! సామాన్య కూలీ ఖాతాలోకి ₹294 కోట్లు.. ఆ తర్వాత జరిగిన ట్విస్ట్ మామూలుగా లేదుగా!

మద్యం బాటిళ్ల లారీ బోల్తా.. ఎగబడ్డ జనం

×