E-Paper
Advertisement

Navy Operation: ఇండియన్ నేవీ సాహసానికి అంతర్జాతీయ ప్రశంసలు.. విదేశీ నౌకకు ఊపిరిపోసిన భారత్!

Navy Operation: ఇండియన్ నేవీ సాహసానికి అంతర్జాతీయ ప్రశంసలు.. విదేశీ నౌకకు ఊపిరిపోసిన భారత్!
Advertisement

Navy Operation: ఇండియన్ నేవీ ఓ రిస్కీ ఆపరేషన్ చేపట్టింది. షిప్‌లో పేలకుండా ఉండిపోయిన మిసైల్ వార్ హెడ్ ను రిమూవ్ చేసింది. ఈ రిస్కీ ఆపరేషన్ ఎలా సాగిందో ఓసారి చూద్దాం. మార్షల్ ఐలాండ్స్ జెండా ఉన్న MT ఒలింపిక్ లైఫ్ ట్యాంకర్, యూఏఈలోని ఫుజైరా నుంచి కేరళ కొచ్చికి వస్తుండగా, మే 26న ఒమన్ తీరంలో దీనిపై మిసైల్ అటాక్ జరిగింది. ఈ దాడిలో మిసైల్.. నేరుగా నౌక వెలుపలి భాగాన్ని చీల్చుకుంటూ లోపలికి దూసుకెళ్లింది. అది చాలా కంపార్ట్‌మెంట్లను దాటుకుని నేరుగా నౌకలోని ప్రధాన ఇంధన నిల్వ ట్యాంకు దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అదృష్టవశాత్తూ ఆ వార్‌హెడ్ అక్కడ పేలలేదు. నౌకలో ఎలాంటి భారతీయ సిబ్బంది లేనప్పటికీ, అత్యంత ప్రమాదకరమైన ఈ స్థితిలోనే ఈ ట్యాంకర్ కొచ్చి వైపు అదే కండీషన్ లో తన ప్రయాణాన్ని కొనసాగించింది.

హైరిస్కీ ఆపరేషన్..

ఇన్ఫర్మేషన్ ఫ్యూజన్ సెంటర్.. ఇండియన్ ఓషన్ రీజన్ ద్వారా భారత నేవీకి ఈ సమాచారం అందింది. దీంతో కొచ్చిలోని సదరన్ నావల్ కమాండ్ వెంటనే రంగంలోకి దిగి, ఒక ప్రత్యేక ఎక్స్‌ప్లోజివ్ ఆర్డ్నెన్స్ డిస్పోజల్ టీమ్‌ను ఈ హైరిస్కీ ఆపరేషన్ కోసం పంపింది. సో ఈ ఆపరేషన్ ఎలాంటిదంటే టైం బాంబు లాంటి పరిస్థితి. ఇంధన ట్యాంకు దగ్గర ఈ పేలని వార్‌హెడ్ ఉండటం వల్ల ఏ నిప్పురవ్వ వచ్చినా భారీ పేలుడుతో ఏదైనా జరిగే ప్రమాదం ఉండేది. కానీ ఇండియన్ నేవీ ఎక్స్ పర్ట్స్.. ఫ్యూయల్ ట్యాంక్ దగ్గరికి వెళ్లి, అత్యంత లేటెస్ట్ టెక్నాలజీతో ఆ క్షిపణి డిటోనేషన్ మెకానిజంను గుర్తించి, దానిని విజయవంతంగా డిసేబుల్ చేశారు.

Advertisement

Also read: Khammam District: ఖమ్మం బాలిక ఘటనలో సంచలనాలు.. వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నిజాలు..!

అంతర్జాతీయ ప్రశంసలు..

పకడ్బందీ ప్రణాళికతో, ప్రాణాలను పణంగా పెట్టి ఆ వార్‌హెడ్‌ను, దానికి సంబంధించిన శకలాలను ఇంధన ట్యాంకు నుంచి సురక్షితంగా బయటకు తీశారు. వెలికితీసిన ఆ పేలుడు పదార్థాన్ని నేవీ అధికారులు కొచ్చిలోని ఒక సేఫ్టీ రక్షణ కేంద్రానికి తరలించారు. అంతర్జాతీయ సిబ్బంది ఉన్న ఈ విదేశీ నౌకను, కొచ్చి తీరంలో ముప్పు నుంచి కాపాడటంలో ఇండియన్ నేవీ సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి, సాంకేతిక నైపుణ్యం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటుంటోంది.

Advertisement

Storey By: Anup Big Tv

Also read: ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు.. రాజ్‌ కసిరెడ్డి అరెస్ట్.. తర్వాతి టార్గెట్ జగనేనా?

Related News

నిజం చెప్పిన జర్నలిజంపై నిషేధమా!? మెగా డీఎస్సీ స్కాం పై జగన్ కీలక వ్యాఖ్యలు.. ఈ నాలుగు ప్రశ్నలకు సమాధానం చెబుతారా!? ఆధారాలతో సహా వాస్తవాలు బయట పెట్టిన జగన్…

సంఘాలపై ఉద్యోగుల గుర్రు.. నిరసనలపై సర్కార్‌ నీళ్లు జల్లే ప్రయత్నం.. చీఫ్ సెక్రటరీ రాతపూర్వక హామీతో – ఛలో హైదరాబాద్ తాత్కాలిక వాయిదా..!

ఇక కురుక్షేత్రమే వచ్చే ఎన్నికల్లో నేనేంటో చూపిస్తా: జగన్

సూర్యుడి చుట్టూ భూమి.. కేసీఆర్‌ చుట్టూ చావు రాజకీయాలు! వందేండ్లు బతకాలంటున్నారు… ఆరోగ్యం బాగలేదనీ అంటున్నారు..!

సర్ జాబితా ప్రక్షాళనలో గందరగోళం.. విచారణలతో వృద్ధులకు తప్పని తిప్పలు!

ఓ వీర్ల శంకర్‌.. ఓ తాతా మధు.. ఇద్దరూ నోరు జారారు..! హద్దు మీరారు..! సమర్థించుకోవాలనుకోవడం..  రెండు పార్టీల పొరపాటే..!

దళిత ఇష్యూలో అభాసుపాలైన ఆర్ఎస్‌ స్టాండ్‌.. దళిత స్పీకర్‌పై ప్రవీణ్‌ స్పందించలేదేం..? రాజకీయాలే ప్రాధాన్యమా? దళితుల ఆత్మగౌరవం పట్టదా..?

పాలిటిక్స్ To పర్సనల్.. హద్దులు దాటుతున్న రాజకీయం.. బలవుతున్న కేడర్!

Big Stories

Advertisement
×