E-Paper
Advertisement

Illegal Mining: ముచ్చోని పల్లి రిజర్వాయర్ వద్ద మట్టి మాఫియా అరాచకం.. పట్టించుకోని అధికారులు!

Illegal Mining: ముచ్చోని పల్లి రిజర్వాయర్ వద్ద మట్టి మాఫియా అరాచకం.. పట్టించుకోని అధికారులు!
Advertisement

Illegal Mining: స్వేచ్చ బ్యూరో: గట్టు మండలం పరిధిలోని ముచ్చోనిపల్లి రిజర్వాయర్, 109 ప్యాకేజీ అలుగు వద్ద ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా రాత్రింబవళ్లు అనధికారికంగా మట్టి తవ్వకాలు సాగుతున్నాయి. ప్రభుత్వ సంపదను కొల్లగొడుతూ కొందరు వ్యక్తులు యథేచ్ఛగా సాగిస్తున్న ఈ అక్రమ దందాపై స్థానిక ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

స్పందించని స్థానిక యంత్రాంగం

ఈ అక్రమ మట్టి రవాణాపై గద్వాల ఆర్డీఓ (RDO), గట్టు తాసిల్దార్ (MRO), మరియు గట్టు ఎస్ఐ (SI) లకు స్థానికులు పూర్తి సమాచారాన్ని అందించారు. అక్రమ తవ్వకాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వాట్సాప్ ద్వారా అధికారులందరికీ పంపినప్పటికీ, వారు చూసిచూడనట్లు వ్యవహరించడం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు అందినా క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.స్థానిక అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో, ఇకనైనా జిల్లా కలెక్టర్ స్పందించి ఈ అక్రమ మట్టి తవ్వకాలను తక్షణమే నిలిపివేయాలని, నిబంధనలను ఉల్లంఘించి తవ్వకాలు జరుపుతున్న వారిపై మరియు వారికి సహకరిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముచ్చోనిపల్లి గ్రామస్తులు మరియు పరిసర ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also read: హైదరాబాద్‌లో ఘోరం.. ఫోన్ అతిగా వాడుతోందని.. భార్య తలలోకి బుల్లెట్లు దించాడు!

అక్రమ మట్టి తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు

గద్వాల మండలం వెంకటోంపల్లి గ్రామ శివారు నుంచి అక్రమంగా మట్టి తరలిస్తున్న వాహనాలను బుధవారం రాత్రి జమ్మిచేడు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూముల నుంచి మట్టిని తవ్వుతూ తరలిస్తున్నారని, రాత్రి వేళల్లో భారీ శబ్దాలతో మట్టిలోడుతో వెళ్తున్న టిప్పర్లు గ్రామం నుంచి వెళుతుండటంతో ప్రజలకు నిద్ర పట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also read: హాలీవుడ్ దిగ్గజాలకే మైండ్ బ్లాక్…స్టార్స్ లేకుండానే రూ. 2200 కోట్లా?

Related News

విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు

బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు, ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్

సికింద్రాబాద్ టూ సిద్దిపేట రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్!

జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!

సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!

కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

జూరాల రైతులకు సర్కార్ బిగ్ షాక్.. సాగునీటి విడుదలపై నీలినీడలు!

‘మీ వీపు మీరు చూసుకోండి’.. రాహుల్ గాంధీకి డీకే అరుణ ఘాటు సెటైర్లు!

Big Stories

Advertisement
×