E-Paper
Advertisement

World’s Largest Snake: ప్రపంచంలోనే అతిపెద్ద పాము.. 26 అడుగులు.. 440 lbs బరువు.. వామ్మో చూస్తే అంతే సంగతి!

World’s Largest Snake: ప్రపంచంలోనే అతిపెద్ద పాము..  26 అడుగులు.. 440 lbs బరువు.. వామ్మో చూస్తే అంతే సంగతి!
Advertisement
World Largest Snake Discovered
World Largest Snake Discovered

World Largest Snake Discovered in Amazon Rainforest: పాము .. ఈ పేరు వినగానే ముందుగా మనకు అనకొండ సినిమా గుర్తొస్తుంది. ఈ సినిమాలో పాములు చూడటానికి చాలా భయంకరంగా ఉంటాయి. వేగంగా దూసుకొచ్చి మనుషులను చుట్టేసి చంపి తినేస్తుంటాయి. నిజానికి అనకొండ జాతీ పాములు అంతకన్నా ప్రమాదకరంగా ఉంటాయి.

పాముల ప్రపంచానికి సంబంధించి ఇటీవల అతిపెద్ద జెయింట్ అనకొండను కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఈ పాము నీటి అడుగు భాగంలో వేగంగా వెళుతోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ పాము దాదాపు 500 కిలోల బరువు ఉంటుంది.

Advertisement

నేషనల్ జీయోగ్రాఫిక్స్ సిరీస్ అయిన ‘పోల్ టు పోల్ విత్ విల్ స్మిత్’ షో భాగంగా ఈ అనకొండను కనుగొన్నారు. ఈ జెయింట్ అనకొండలను గ్రీన్ అనకొండలు అని కూడా అంటారు. ఇవి ప్రపంచంలోనే అత్యంత బరువైనవిగా, పెద్దవిగా నమ్ముతారు. ఇవి ఎక్కువగా దక్షిణ అమెరికాలో కనిపిస్తాయి. గ్రీన్ అనకొండను యూనెక్టస్ అకాయిమా అని కూడా పిలుస్తారు.

Read More: ప్లాస్టిక్ పై పులి నేర్పిన పాఠం.. వైరల్ వీడియో..!

Advertisement

ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ‘DennD68’ అనే ఖాతా నుంచి అప్లోడ్ అయ్యింది. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద పాము కనుగొనబడింది. నార్తర్న్ గ్రీన్ అనకొండ 26 అడుగుల పొడవు, 440 పౌండ్లు బరువు ఉంటుంది. దాని తల మానవుడి పరిమాణంతో సమానంగా ఉందని పోస్ట్ రాసుకొచ్చారు.

Read More: భారీ పాముతో నిద్రిస్తున్న చిన్నారి..!

ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అమ్మో.. ఆ పాము దగ్గరకు ఎలా వెళ్లావు ? మాకు వీడియోలో చూస్తుంటేనే వణుకు పుడుతోందని అంటున్నారు. అసలు పాము బరువు ఎలా కొలుస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. వీడియోకు వేల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి.

Tags

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×