BigTV English

Sandeshkhali Protest: దుమారం రేపుతున్న సందేశ్‌ఖాలీ ఘటన.. స్పందించిన బెంగాల్‌ డీజీపీ

Sandeshkhali Protest: దుమారం రేపుతున్న సందేశ్‌ఖాలీ ఘటన.. స్పందించిన బెంగాల్‌ డీజీపీ

Bengal DGP responded: బెంగాల్‌ సందేశ్‌ఖలీనీలోని నిరసనలు కదిలించాయి. ఈ ఘటనపై బెంగాల్ డీజీపీ రాజీవ్‌ కుమార్‌ స్పంధించారు. సంఘటనా స్థలానికి చేరుకుని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. టీఎంసీ నాయకులు ఆ ప్రాంతంలో మహిళలపై లైంగిక వేధింపులు, బలవంతంగా భూ సేకరణకు పాల్పడ్డారని ఆరోపించారు.


కర్రలతో దాడి చేసి.. బెల్మజూర్‌ ప్రాంతంలోని ఫిషింగ్‌ యార్డ్‌ సమీపంలో ఉన్న గడ్డి పాకలను తగలబెట్టారు. టీఎంసీ నాయకుడు షాజహాన్‌ షేక్‌తో పాటు అతని సోదరుడు సిరాజ్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా పోలీసులు ఏమీ చేయలేదు. అందుకే మా భూమి, గౌరవం తిరిగి పొందడానికి మేము ప్రతిదీ చేస్తున్నామని ఒక నిరసనకారుడు చెప్పాడు.

అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. మధ్యాహ్నం కుమార్ నది సమస్యాత్మక ప్రాంతానికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. మీరు ఫిర్యాదు చేయండి మేము ఇక్కడ పోలీసు క్యాంపును ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటాము. కానీ దయచేసి చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దు అని తెలిపారు.


Read More: కేజ్రీవాల్ ను అరెస్టు చేయించాలని కుట్ర.. ఢిల్లీ మంత్రుల సంచలన వ్యాఖ్యలు..

మీడియాతో మాట్లడిన కుమార్‌ ఈ ప్రాంతంలో చట్టబద్ధమైన పాలనను ఏర్పాటు చేస్తామని కుమార్ అన్నారు. డీజీపీ బుధవారం సందేశ్‌ఖాలీని సందర్శించి అక్కడి పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. రాత్రి అక్కడే బస చేసిన ఆయన గురువారం కోల్‌కతాకు తిరిగి వచ్చారు. సందేశ్‌ఖాలీలో జనవరి 5న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై మూక దాడి జరిగినప్పటి నుండి షాజహాన్ అధికారులను తప్పించుకున్నాడు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×