BigTV English

World’s Longest Traffic Jam: ప్రపంచంలోనే అదిపెద్ద ట్రాఫిక్ జామ్.. 12 రోజుల పాటు రోడ్డు మీదే నరకం చూసిన వాహనదారులు!

World’s Longest Traffic Jam:  ప్రపంచంలోనే అదిపెద్ద ట్రాఫిక్ జామ్.. 12 రోజుల పాటు రోడ్డు మీదే నరకం చూసిన వాహనదారులు!

Longest Traffic Jam: జనాభా ఎక్కువగా ఉన్న నగరాల్లో తరచుగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. సుమారు రెండు, మూడు గంటల పాటు వాహనాలు ఆగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ, చైనాలో ఏకంగా 12 రోజుల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 100 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిపోయాయి. 2010లో జరిగిన ఈ ఘటన ప్రపంచలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ, ఇంత పెద్ద మొత్తంలో ఎందుకు ట్రాఫిక్ జామ్ ఏర్పడిందంటే?


ఈ ట్రాఫిక్ జామ్ ఎందుకు ఏర్పడిందంటే?

ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్ అనేది బీజింగ్-టిబెట్ ఎక్స్ ప్రెస్ వేలో ఏర్పడింది. ఆగష్టు 11, 2010లో ఈ ట్రాఫిక్ జామ్ మొదలయ్యింది. 12 రోజుల పాటు 100 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. కనుచూపు మేరలో ఎటు చూసినా వాహనాలే ఆగిపోయాయి. ప్రయాణీకులు, వాహనదారులు రోడ్డు మీదే ప్రత్యక్ష నరకం ఎలా ఉంటుందో చూడాల్సి వచ్చింది. మంగోలియా నుంచి బీజింగ్ కు బొగ్గు, నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్లే ట్రక్కుల కారణంగా ఈ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అదే టైమ్ లో బీజింగ్-టిబెట్ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణ దశలో ఉంది. ఈ నేపథ్యంలో వాహనాలు ముందుకు కదల్లేకపోయాయి. రహదారి నిర్మాణ పనుల కారణంగా వన్ వే లో వాహనాలను వెళ్లేలా ఏర్పాటు చేశారు. అదే సమయంలో మంగోలియా నుంచి బీజింగ్ కు పెద్ద మొత్తంలో నిర్మాణ సామాగ్రిని తీసుకెళ్లే ట్రక్కులు రావడంతో వాహనాలు ముందుకు కదల్లేకపోయాయి. చూస్తుండగానే 100 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.


ఇక పెద్ద పెద్ద ట్రక్కులు రోడ్డు మీదకి రావడంతో పాటు మరికొన్ని వాహనాలు రోడ్డు మీదే పలు కారణాలతో ఆగిపోవడంతో కనీవినీ ఎరుగని రీతిలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాహనాలు ముందుకు కదల్లేక ఎక్కడిక్కడే ఆగిపోయాయి. ఒక రోజులో కేవలం 1 కిలో మీటర్ మేర వాహనాలు ముందుకు కదిలాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ అధికారులు ఏకంగా 12 రోజుల పాటు కష్టపడ్డారు.

ట్రాఫిక్ జామ్ ను క్యాష్ చేసుకున్న పరిసర ప్రజలు

ఇక ఈ ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో రహదారి పరిసర గ్రామాల ప్రజలు క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. రోడ్డు పక్కనే ప్రయాణీకులు విశ్రాంతి తీసుకునేలా తాత్కాలిక గుడారాలు నిర్మించారు. అందులో నివసించేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు వసూళు చేశారు. అటు అల్పాహారం, వాటర్ బాటిళ్లు, స్నాక్స్, నూడుల్స్, సహా ఇతర ఫుడ్ ఐటెమ్స్ అమ్మేందుకు ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. సాధారణ ధరతో పోల్చితే ఐదారు రెట్లు ఎక్కువ ధరకు వాటిని విక్రయించారు. ధర మరీ ఎక్కువ అయినప్పటికీ, తప్పని పరిస్థితుల్లో కొనుగోలు చేయాల్సి వచ్చింది. మొత్తంగా ప్రపంచంలోనే అతి పెద్ద ట్రాఫిక్ జామ్ గా బీజింగ్ ట్రాఫిక్ జామ్ గుర్తింపు తెచ్చుకుంది.

Read Also: 12 మంది భార్యలు.. 102 మంది పిల్లలు.. నువ్వు మామూలు మనిషివి కాదు సామీ!

Related News

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Big Stories

×