Akhil Akkineni: గతేడాది అక్కినేని ఇంట పెళ్లి సంబురాలు ఆకాశాన్ని తాకిన విషయం తెల్సిందే. అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్య , నటి శోభితాను రెండో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. డిసెంబర్ 4 న అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ ఏడాది నాగార్జున చిన్న కొడుకు అఖిల్ వివాహం కూడా అంతే గ్రాండ్ గా జరగనుంది. అఖిల్ అనే సినిమాతో అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. చై కన్నా ఎక్కువ అఖిల్ ను లాంచ్ చేయడానికే నాగ్ చాలా కష్టపడ్డాడు.
వరుస సినిమాలను రీ.. రీ..రీ లాంచ్ లు చేస్తూ వస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో అయ్యగారు హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత ఆ హిట్ పరంపరను కొనసాగిస్తాడు అనుకొనేలోపు ఏజెంట్ సినిమాతో భారీ డిజాస్టర్ ను అందుకున్నాడు. అసలు అయ్యగారు అనవసరంగా సినిమాల్లోకి వచ్చాడేమో.. క్రికెట్ లో రాణించి ఉంటే ఈపాటికి సచిన్, విరాట్ రేంజ్ లో ఉండేవాడు అని అనుకున్నవారు కూడా లేకపోలేదు. కానీ, అఖిల్ ఇంట్రెస్ట్ అంతా అక్కినేని లెగసీని కాపాడాలనే ఉందని తెలుస్తోంది. అందుకే పట్టు వదలని విక్రమార్కుడుగా ఇండస్ట్రీపై హిట్ కోసం దాడి చేస్తూనే ఉన్నాడు.
Tollywood: మళ్లీ తల్లి కాబోతున్న బ్యూటీ.. కొత్త ఏడాది.. కొత్త శుభవార్తతో వీడియో షేర్..!
ప్రస్తుతం అఖిల్ చేతిలో ఒక పాన్ ఇండియా సినిమాఉంది . త్వరలోనే ఈ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ఈలోపే అయ్యగారు కూడా ఒక ఇంటివారు కానున్నారు. అన్న చై పెళ్ళికి ముందే అఖిల్ తాను ప్రేమించిన అమ్మాయిని ప్రపంచానికి పరిచయం చేశాడు. అఖిల్.. దుబాయ్ కు చెందిన జైనాబ్ రావ్‌జీతో వివాహం సెట్ అయ్యినట్లు అక్కినేని కుటుంబం అధికారికంగా తెలిపింది. ఇక అప్పటి నుంచి అఖిల్ – జైనాబ్ జంట టాలీవుడ్ టాప్ కపుల్ లిస్ట్ లో చేరిపోయారు.
చై పెళ్ళిలో వీరిద్దరూ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఇద్దరూ కలిసి తిరుగుతుంటే ఎంత చూడముచ్చటగా ఉందో అని అభిమానులు వీరికి దిష్టి తీయడం కూడా మొదలుపెట్టేశారు. ఇక తాజాగా కొత్త ఏడాది ఈ జంట కొత్త ఫోటో షేర్ చేసి అభిమానులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. వైట్ డిజైనర చీరలో జైనాబ్.. వైట్ అండ్ బ్లాక్ డిజైనర్ కుర్తాలో అఖిల్ అద్దం ముందు నిలబడి సెల్ఫీ తీసుకున్నారు. జైనబ్ అందంగా కనిపించినా.. అందరి చూపు మాత్రం అఖిల్ దగ్గరే ఆగిపోయింది.
అయ్యగారి లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఈ లుక్ తన తదుపరి సినిమా కోసం మెయింటైన్ చేస్తున్నాడని తెలుస్తోంది. మొన్నటివరకు గుబురు గడ్డం, జుట్టుతో కనిపించిన అఖిల్ కొద్దిగా హెయిర్ కట్ చేసినాట్లు కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అన్నా.. ఏమున్నావన్నా .. అదిరిపోయావ్ అని కొందరు. అబ్బబ్బా.. అమ్మగారితో అయ్యగారి సెల్ఫీ.. కడుపు నిండిపోయింది బంగారం అని ఇంకొందరు కామెంట్స్ పెడుతున్నారు. మరి అఖిల్.. హిట్ కొట్టి పెళ్లి చేసుకుంటాడో.. లేక పెళ్లి చేసుకున్నాక హిట్ అందుకుంటాడో చూడాలి.