సాధారణంగా భారతీయ కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక భార్య లేదంటే ఇద్దరు భార్యలు ఉంటారు. వారికి ఓ నలుగురు లేదంటే ఐదుగురు భార్యలు ఉంటారు. మొత్తం మీద 20 మంది లేదంటే 30 మంది ఉంటే పెద్ద కుటుంబం అంటారు. కానీ, ఉగాండాలో ఓ వ్యక్తి ఏకంగా 12 మంది భార్యలను చేసుకున్నాడు. 102 మంది పిల్లలున్నాడు. వారి పిల్లలతో కలిపి మొత్తంగా 578 మందికి చేరుకున్నారు. ఇప్పుడు ఆ కుటుంబ పెద్దకు ఓ కష్టం వచ్చింది. తన కుటుంబాన్ని పోషించే పరిస్థితి లేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్నాడు.
578 మందితో కూడిన ‘బాహుబలి’ కుటుంబం
ఉగాండాలోని ముకిజాకు చెందిన ముసా హసహ్య కసేరాకు ఇప్పుడు 70 ఏళ్లు. ప్రస్తుతం ఈయన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాడు. కసేరా 1972లో తొలిసారి పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు ఆయన వయసు 17 సంవత్సరాలు. ఆ తర్వాత ఒకరి తర్వాత మరొకరి చొప్పున మొత్తం 12 మందిని చేసుకున్నాడు. ఒక్కో భార్యకు సుమారు 9 మంది చొప్పున పిల్లల్ని కన్నాడు. ఆయన మొత్తం 102 మంది పిల్లలు అయ్యారు. వాళ్లకు పెళ్లిళ్లై పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆయన ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్య ఏకంగా 578కి చేరింది.
కుటుంబాన్ని పోషించలేకపోతున్న కసేరా
పెళ్లిళ్లు చేసుకున్నాడు. పిల్లల్ని కన్నాడు. కానీ, ఇప్పుడు వారిని పోషించలేక అవస్థలు పడుతున్నాడు. వారికి కడుపు నింపేందుకు గొడ్డు చాకిరీ చేస్తున్నాడు. వారికి ఫుడ్ పెట్టడమే కాదు, వారి పేర్లు కూడా గుర్తు పెట్టుకోలేకపోతున్నారని కసేరా. అందుకే వారి పేర్లు అన్నింటినీ ఓ నోట్ పుస్తకంలో రాసుకున్నారట. దాన్ని చూసి వారిని పిలుస్తారట.
కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇల్లు.. రెండు ఎకరాల భూమి..
కసేరాకు పెద్దగా ఆస్తిపాస్తులు ఏమీ లేవు. ఓ సాధారణ ఇల్లు ఉంది. అది కూడా ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. రెండు ఎకరాల పంటభూమి ఉంది. ఆ పొలంలో పని చేస్తూ, ఆ ఇంట్లోనే ఉంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇల్లు గడవక చాలా ఇబ్బంది పడుతున్నాడు. వీరిలో కొంత మంది పనికి వెళ్లి డబ్బులు సంపాదిస్తుండగా, మరికొంత మంది ఇంటి అవసరాల కోసం నీళ్లు తేవడం, కట్టెలు కొట్టుకు రావడం లాంటి పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఓ పూట తింటూ, మరోపూట పస్తులుంటూ బతుకీడుస్తున్నారు. మరోవైపు కసేలా ఆరోగ్యం కూడా క్షీణిస్తున్నది. ఆయనతో ఉండలేక, ఇద్దరు భార్యలు వెళ్లిపోయారు. ఆయన కొడుకు టీచర్ గా పని చేస్తూ, కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో తన కుటుంబానికి అండగా నిలువాలని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నాడు. ఆకలితో అలమటిస్తున్న తన బిడ్డలకు కడుపు నింపాలని కోరుతున్నాడు.
For those who enjoy watching travel vlogs, you might be familiar with Kailash Meena, aka The Indo Trekker. Recently, Kailash visited a village in Uganda, where he met Musa Hasaya Kaseera, the man who holds the record for having the most children in the world.
As seen in the… pic.twitter.com/wlQv63CGVe
— Naman Sharma (@YourNaman) December 26, 2024
అటు కసేరాపై సోషల్ మీడియాలో చాలా మంది ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఆయనది పెద్ద ఫ్యామిలీ కాదు, ఓ జిల్లాగా ప్రకటిస్తే బాగుటుందని ట్రోల్ చేస్తున్నారు. కసేరాను మనిషి అనడం కంటే పిల్లల్ని పుట్టించే యంత్రం అని పిలిస్తే సరిపోతుందంటూ కామెడీ చేస్తున్నారు.
Read Also: పెళ్లి మండపంలో పురోహితుడికి కోపం.. దెబ్బకు గాల్లో ఎగిరి.. వీడియో వైరల్!