Alekhya Chitti Pickles Issue: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అలేఖ్య చిట్టీ పికెల్స్ వివాదంపై ప్రపంచ యాత్రికుడు అన్వేష్ స్పందించాడు. అలేఖ్య సిస్టర్స్ తో తనకు చాలా కాలంగా పరిచయం ఉందన్న ఆయన, వాళ్ల బిజినెస్ ఎలా మొదలయ్యింది? బిజినెస్ పెట్టడానికి కావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకే వారికి ఇలా జరిగిందా? అనే విషయాలపై ఆసక్తిర విషయాలు వెల్లడించాడు.
బెట్టింగ్ యాప్స్ డబ్బుతో పచ్చళ్ల వ్యాపారం
అలేఖ్య సిస్టర్స్ అంతా సోషల్ మీడియాలో యూట్యూబ్ చానెల్స్ నడుపున్నారని చెప్పిన అన్వేష్.. బెట్టింగ్ యాప్స్ ను కూడా ప్రమోట్ చేసినట్లు చెప్పాడు. వాటి ద్వారా వచ్చిన డబ్బుతోనే పచ్చళ్ల వ్యాపారం మొదలు పెట్టారని వివరించాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయకూడదని వాళ్లకు చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించానన్న ఆయన.. చివరికి భగవంతుడే వారికి ఇలా శిక్ష వేశాడని చెప్పుకొచ్చాడు. ముగ్గురు కష్టపడి వ్యాపారాన్ని ఈ స్థాయికి తీసుకొచ్చినప్పటికీ, నోటికొచ్చినట్లు వాగి, ఇంకా చెప్పాలంటే బలుపెక్కి మాట్లాడిన మాటలే వారిని పాతాళానికి తొక్కేశాయన్నాడు. ఇతరులతో పోల్చితే వారి పచ్చళ్ల ధర ఎక్కువగా ఉంటుందని, ఒకవేళ అంత ధర ఎందుకు? అని ప్రశ్నించిన వారికి నచ్చితేనే కొనండి అని చెప్తే సరిపోయేదన్నాడు. కానీ, చాలా మంది వారిని బూతులతో ఇరిటేట్ చేయడం వల్లే అలా మాట్లాడాల్సి వచ్చిందన్నాడు.
ఒకరికి మించి మరొకరికి బీపీ
ఇక అలేఖ్య సిస్టర్స్ లో ముగ్గురికీ బీపీ ఓ రేంజ్ లో ఉంటుందని చెప్పాడు అన్వేష్. పెద్ద ఆమెతో పోల్చితే మిగతా ఇద్దరికి తారస్థాయిలో ఉంటుందన్నాడు. రమ్యకు ఏకంగా 200 ఉంటుందని చెప్పుకొచ్చాడు. అయినా, చాలా మంది పికెల్స్ ధర ఎంత? అని కాకుండా, మీ ధర ఎంత? అని అడిగే వాళ్ల సంఖ్యే ఎక్కువ అన్నాడు. అలాంటి వారి వల్లే అలేఖ్య సిస్టర్స్ కు బీపీ పెరిగిందన్నారు. ఈ వివాదం నేపథ్యంలో సుమ, అలేఖ్య, రమ్య వీడియోలు రిలీజ్ చేయడంతో పాటు అందరికీ క్షమాపణలు చెప్పినందున ఇక్కడితే ఆ గొడవను వదిలేయడం మంచిదన్నాడు. ఈ ఆ ముగ్గురు అక్కా చెల్లెళ్లు పచ్చళ్ల బిజినెస్ క్లోజ్ చేసి, లడ్డూల వ్యాపారం మొదలుపెట్టాలని అన్వేష్ సలహా ఇచ్చాడు. లడ్డూలు, పూతరేకులు, కాజాలు లాంటి స్వీట్స్ బిజినెస్ చేయాలన్నాడు. ఇకపై స్వీట్స్ ను రెండు రకాల ధరల్లో తయారు చేయాలన్నాడు. ఎక్కువ డబ్బులు పెట్టి కొనే వారికి హై క్వాలిటీ లడ్డూలు, తక్కువ డబ్బులకు కావాలి అనే వారికి లో క్వాలిటీ లడ్డూలు అందుబాటులో ఉంచాలని చెప్పుకొచ్చాడు. ఇకపై బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లకుండా, బూతులు తిట్టకుండా వ్యాపారం చేసుకుంటూ మళ్లీ సక్సెస్ బాటలోకి వెళ్లాలని ఆకాంక్షించాడు. ప్రస్తుతం అన్వేష్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈసారి ఇండియాకు వచ్చినప్పుడు అలేఖ్య సిస్టర్స్ అరిటాకు వేసి పికెల్స్ తో భోజనం పెడతారంటూ నెటిజన్స్ అన్వేష్ పై పంచ్ లు వేస్తున్నారు.
Read Also: ఒసేయ్.. నీకెందుకే పచ్చళ్లు.. పాచిపని చేస్కో.. అలెఖ్య మరో ఆడియో లీక్!
Read Also: పచ్చళ్లు అమ్ముకోండి పర్వాలేదు.. ఆ పచ్చి బూతులు ఎందుకమ్మా?
Read Also: 30 సెకన్లు తిట్టి.. 7 సెకన్ల వీడియో రిలీజ్ చేసిన అలేఖ్య చిట్టీ.. క్షమిస్తారా?
Read This Article In English: Naa Anveshana reacts on Alekhya Chitti Pickles