IIST Jobs: బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కల్గిన అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
భారత ప్రభుత్వ అంతరిక్ష శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ(IIST) ఇంజినీర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4
ఇందులో ఇంజినీర్(సివిల్), ఇంజినీర్(ఎలక్ట్రికల్) ఉద్యోగాలు ఉన్నాయి.
ఇంజినీర్(సివిల్)- 3
ఇంజినీర్(ఎలక్ట్రికల్)- 1 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: సివిల్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ పాసై ఉండాలి. సంబంధిత రంగాలలో 2 సంవత్సరాల ఎక్స్ పీరియన్స్ కూడా పరగణిలోకి తీసుకుంటారు.
ఆటో క్యాడ్, రీవిట్, ఎంఎస్ ప్రాజెక్ట్ తదితర సాఫ్ట్ వేర్ లపై అవగాహన కల్గి ఉండాలి.
వయస్సు: 2025 జనవరి 31 నాటికి 35 సంవత్సరాలు మించి ఉండకూడదు.
ఉద్యోగ ఎంపిక విధానం: షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులను రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఆన్ లైన్ దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 31
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.40,000 వేతనం ఉంటుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.iist.ac.in/
Also Read: India Post Payments Bank: IPPBలో జాబ్స్.. రూ.2లక్షల జీతం భయ్యా.. మరో మూడు రోజులే..!
అర్హులైన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. మంచి వేతనం కూడా లభిస్తుంది. ఆల్ ది బెస్ట్.