E-Paper
Advertisement

ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను హతమార్చిన భర్త

ఖమ్మం జిల్లాలో ఘోరం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భార్యను హతమార్చిన భర్త
Advertisement

Khammam: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోల్ తండాలో ఒక ఘోర కలియుగ వింత చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యే కదా అని కాపాడుకోవాల్సింది పోయి, కేవలం డబ్బు పిచ్చితో ఓ భర్త ఆమె ప్రాణాలు తీశాడు. అప్పుల ఊబి నుంచి బయటపడటం కోసం, బీమా డబ్బులపై కక్కుర్తి పడి మీనాక్షి అనే మహిళను ఆమె భర్త శివాజీ అతి దారుణంగా కొట్టి చంపేశాడు.

ఆపై ఈ ఘోరాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆమె ముందే ఉరివేసుకుని చనిపోయినట్లు నమ్మించే ప్రయత్నం చేసి అక్కడి నుండి పరారయ్యాడు. 14 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను ఇలా డబ్బు కోసం బలిపశువును చేయడం స్థానికంగా పెను కలకలం రేపింది.

Advertisement

కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. వారి ఇంటిపై దాదాపు రూ. 80 లక్షల వరకు అప్పులు ఉన్నాయట. ఆ అప్పుల బాధ నుండి గట్టెక్కడానికి, మీనాక్షి పేరు మీద ఉన్న రూ. 1 కోటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బులను ఎలాగైనా చేజిక్కించుకోవాలనే కుట్రతోనే శివాజీ ఈ దారుణానికి ఒడిగట్టాడని బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఆమెను మానసికంగా, శారీరకంగా తీవ్రంగా వేధించినట్లు బంధువులు కొన్ని ఆధారాలను, దృశ్యాలను బయటపెట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే ఇలా కాలయముడిగా మారడం అందరినీ కలచివేస్తోంది.

Also Read: సచివాలయం వద్ద రణరంగం.. ‘తెలంగాణ రక్షణ సేన’ అధ్యక్షురాలు కవిత అరెస్ట్!

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×