Amaravati News: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. అంతరించిపోతున్న పక్షులు, జంతువులను సంరక్షించే పనిలో పడింది. రేపో మాపో ఏపీ అడవులకు కొత్త అతిథి రాబోతోంది. ఇంతకీ ఏ జంతువుని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
ఆంధ్రప్రదేశ్ అడవులకు మరో జంతువు
అడవి దున్నలు లేదా బైసన్‌లకు ఇండియాలో ఓ ప్రత్యేకత ఉంది. ఆ జంతువుని ఇండియన్ బైసన్‌గా పిలుస్తారు. వందల కిలోల బరువు ఉంటాయి. అవి సింహాలను ఎదుర్కొనే శక్తిని కలిగి ఉంటాయని చెబుతుంటారు. 1867 నాటికి దేశంలో వేలాదిగా అడవి దున్నలు ఉండేవి. రకరకాల కారణాల వల్ల 20వ శతాబ్దంలో కనుమరుగైన జాబితాలో చేరిపోయాయి. ఓవైపు వేటగాళ్లు.. ఇంకోవైపు రకరకాల వ్యాధులతో అంతరించినట్లు తెలుస్తోంది.
ఈ తరహా జంతువులను సంరక్షించే పనిలో పడింది ఏపీ ప్రభుత్వం. గౌర్‌గా పిలిచే బైసన్‌లకు పెద్ద చరిత్ర ఉంది. వీటిని నల్లమల అడవులకు తీసుకురావాలని భావిస్తోంది. మూడు నుంచి నాలుగు బ్యాచ్‌లుగా అడవి దున్నలను తీసుకువచ్చేందుకు అటవీ శాఖ ప్లాన్ చేస్తోంది. వేరే ప్రాంతాలు లేదా, దేశాల నుంచి తీసుకొస్తున్న జంతువులు దేశీయ వాతావరణం అనుకూలిస్తుందా?అంటే చెప్పడం కష్టమే.
ఇండియన్ బైసన్ అడవిదున్న రాక
గతేడాది జనవరిలో పశ్చిమ కనుమల నుంచి ఓ అడవి దున్న వందల కిలోమీటర్లు ప్రయాణించింది. చివరకు పాపికొండల మీదుగా నల్లమలలో ప్రవేశించింది. ప్రస్తుతం ఆ దున్న సేఫ్‌గా ఉన్నట్లు కొందరు అధికారుల మాట. ఈ క్రమంలో వాటిని తీసుకురావాలన్నది ఆ శాఖ అధికారుల మాటగా చెబుతున్నారు. దీంతో నల్లమలలో అడవి దున్నల పునరాగమనంపై ఆశలు మొదలయ్యాయి.
అటవీశాఖ బాధ్యతలు తీసుకున్న తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రకరకాల మార్పులు చేస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి మూడు విడతలుగా అడవి దున్నలను తీసుకురావాలని భావిస్తున్నారు. ఒక్కోసారి 40 చొప్పున మూడు విడతలుగా 120 దున్నలను తీసుకురానున్నారట. వీటి సంరక్షణ కోసం వంద ఎకరాల అటవీ విస్తీర్ణంలో ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేస్తారు.
ALSO READ: యువతకు ఉద్యోగాల గేట్ వేగా నైపుణ్యం పోర్టల్
అడవిదున్న మెడకు చిప్ అమర్చుతారు. దానివల్ల అవి ఎక్కడ ఉన్నాయి? ఎంతదూరం తిరుగుతాయి? అనే విషయాలను నిరంతరం పర్యవేక్షించనున్నారు. తొలుత నెల రోజులపాటు ఎన్‌క్లోజర్‌లో ఉంచుతారు. ఆ తర్వాత వాటిని అడవిలో విడిచి పెడతారని అంటున్నారు. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో కుకీ ఏనుగులు ఏపీకి వచ్చిన సంగతి తెల్సిందే.