AP MPTC ZPTC Counting: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్ హోరాహోరీగా సాగుతోంది. వార్త రాసే సమయానికి వేంపల్లె మండలం జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో వైసీపీ ఆధిక్యంలోకి వచ్చింది. వైసీపీ 18 ఓట్లతో లీడ్ లో ఉండగా.. జనసేన 7, స్వతంత్రులు 3 ఓట్లతో ఉన్నారు. మరోవైపు లింగాల మండలం జడ్పీటీసీకి సంబంధించి వైసీపీకి 21, టీడీపీ 2 ఓట్లతో కొనసాగుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా మరికొన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ ఆధిక్యం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అవనిగడ్డ ఎంపీటీసీ పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీ ముందంజలో ఉన్నట్లు సమాచారం. సూళ్లూరుపేట జడ్పీటీసీ, నడకదురు ఎంపీటీసీ కౌంటింగ్ లో వైసీపీ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. అటు అనంతపురం జిల్లాలోని కలశపాడు మండలం, సత్యసాయి జిల్లాలోని తలుపుల మండలం పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లోనూ వైసీపీ అధిక్యం సాధించినట్లుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. తలుపుల జడ్పీటీసీ పోస్టల్ బ్యాలెట్ లో వైసీపీకి 90 ఓట్లు రాగా, టీడీపీ 60, స్వతంత్రులు 2 ఓట్లతో సాగుతున్నారు.
అటు పుంగనూరు నియోజకవర్గం సదుం మండలం జడ్పీటీసీ స్థానంలో 126 ఓట్లు లెక్కించగా.. అందులో వైసీపీకి 74, టీడీపీకి 52 దక్కాయి. మరోవైపు నంద్యాలలో వైసీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లకుండా శిల్పా చక్రపాణి, శిల్పా రవిని పోలీసులు అడ్డుకుంటున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. కౌంటింగ్ ప్రక్రియలో కుట్రలు చేసేందుకు వారిని హౌస్ అరెస్టు చేశారని మండిపడింది. పురపోరులో వైసీపీ వశమైన నందికొట్కూరులో టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య పీఏ హల్ చల్ చేస్తున్నట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కౌంటింగ్ సెంటర్ లో అధికారులు, ఏజెంట్లకు ఆయన డైరెక్షన్ ఇస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
Also Read: ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు నేడే.. ఓట్ల లెక్కింపు షురూ.. కౌంటింగ్ కేంద్రాల్లో టెన్షన్ టెన్షన్!