AP MPTC ZPTC Election Results 2026: ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నేడు వెలువడనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు గాను కౌంటింగ్ ప్రక్రియ మెుదలైంది. 365 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. ఉదయం 8 గంటల నుంచి ఎన్నికల అధికారులు బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తొలి ఫలితాలు వెలువడే అవకాశం రాష్ట్రవ్యాప్తంగా 582 జడ్పీటీసీ, 7,767 ఎంపీటీసీ స్థానాలకు గురువారం పోలింగ్ నిర్వహించగా.. మెుత్తంగా 21,012 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 2,61,52,377 మంది ఓటర్లలో దాదాపు 1.85 కోట్ల మంది ఓటుహక్కు వినియోగించుకోగా.. 70.72% పోలింగ్ నమోదైంది.
మరోవైపు కౌంటిగ్ కేంద్రాల్లో ఓటింగ్ లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు అధికారులు భారీ విస్త్రృత ఏర్పాట్లు చేశారు. 365 లెక్కింపు కేంద్రాల్లో మెుత్తం 39,694 మంది సిబ్బంది కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొన్నారు. మరోవైపు అల్లర్లు, ఆందోళనలకు చెక్ పెట్టేందుకు పోలీసు శాఖ భారీగా తన సిబ్బందిని మోహరించింది. లెక్కింపు కేంద్రాల వద్ద 40,679 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటుచేశారు. అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో లోపల, బయల సీసీటీవీ కెమెరాలతో పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగిన సందర్భాల్లో ఈ సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చర్యలు తీసుకోనున్నట్లు ఎన్నికల సంఘం, పోలీసు శాఖ వెల్లడించాయి.
Also Read: Brahmamudi Serial Today Episode November 7th ‘బ్రహ్మముడి’ సీరియల్: రాజు, ఇందులకు షాక్ ఇచ్చిన పంతులు
ఇదిలా ఉంటే మెుత్తం 9,821 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. అందులో 2,051 ఏగగ్రీవం అయ్యాయి. దీంతో నవంబర్ 5న 7,767 స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. బరిలో మెుత్తం 18,844 మంది అభ్యర్థులు నిలవగా వారిలో వైకాపా అభ్యర్థులు 7,622, టీడీపీ 6,342, జనసేన 1,499 మంది ఉన్నారు. ఇక జడ్పీటీసీ స్థానాలకు వస్తే రాష్ట్రంలో 659 ఉండగా.. ఎన్నికలకు ముందే 77 ఏకగ్రీవమయ్యాయి. దీంతో 582 స్థానాలకు పోలింగ్ జరగ్గా.. 2,169 పోటీ చేశారు. వీరిలో వైసీపీ నుంచి 574, టీడీపీ 452, జనసేన 109, బీజేపీ 34 మంది అభ్యర్థులు పార్టీల వారిగా బరిలో నిలిచారు.
Also Read: Gundeninda GudiGantalu Today episode: ప్రభా కక్కుర్తి.. రోహిణి ప్లాన్ సక్సెస్.. మనోజ్ ఫుల్ హ్యాపీ..