TVK Forgery Case: తమిళనాడు రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి టీటీవీ దినకరన్ కు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (AMMK) మద్దతు ప్రకటించినట్లుగా విడుదలైన లేఖపై వివాదం రాజుకుంది. టీవీకే పార్టీ ఆ లేఖను ఫోర్జరీ చేసి.. తమ పార్టీకి చెందిన దానిగా గవర్నర్ కు సమర్పించిందని AMMK పార్టీ అధినేత టీటీవీ దినకరన్ (TTV Dinakaran) ఆరోపించారు. తమ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే విజయ్ కు మద్దతు ఇచ్చినట్లుగా ఉన్న లేఖ నకిలీదని పేర్కొన్నారు. ఈ మేరకు గవర్నర్ ను కలిసి.. టీవీకే పార్టీపై ఫిర్యాదు సైతం చేశారు.
గవర్నర్ కు ఫిర్యాదు అనంతరం బయటకొచ్చి టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడారు. తమ ఏకైక ఎమ్మెల్యే ఎస్. కామరాజు.. ఎన్‌డీఏ, అన్నా డీఎంకే (AIADMK) పార్టీలకు విధేయుడిగా ఉన్నారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా AIADMK అధినేత కె. పళనిస్వామిని బలపరుస్తూ శుక్రవారం తమ పార్టీ విడుదల చేసిన లేఖలో.. ఎస్. కామరాజు సంతకం కూడా ఉందని పేర్కొన్నారు. కాబట్టి తమ ఎమ్మెల్యే టీవీకేకు మద్దతు ఇచ్చినట్లుగా గవర్నర్ కు టీవీకే పార్టీ సమర్పించిన లేఖ.. అసలైంది కాదని ఆరోపించారు. అదొక ఫోర్జరీ లెటర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.
తమ పార్టీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉండటంతో ఆయన్ను తేలిగ్గా ప్రలోభాలకు గురిచేయవచ్చని టీవీకే పార్టీ భావించి ఉండొచ్చని టీటీవీ దినకరన్ అన్నారు. ఈ ఫోర్జరీ లేఖను తీవ్రంగా పరిగణించి టీవీకే పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ కోరారు. నకిలీ పత్రాలను సృష్టించిన వ్యక్తులతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించవద్దని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఈ ఫోర్జరీ లెటర్ కు సంబంధించి పోలీసు స్టేషన్ లోనూ తాము ఫిర్యాదు చేయబోతున్నట్లు దినకరన్ హెచ్చరించారు.
VIDEO | Chennai: After meeting with Tamil Nadu Governor Rajendra Arlekar, AMMK General Secretary TTV Dhinakaran says, "It appears that TVK has submitted what seems to be a copy of our MLA support letter, which is actually a forged letter. So I have requested the Governor to… pic.twitter.com/gkI8nZtQDf
— Press Trust of India (@PTI_News) May 8, 2026
Also Read: Vijay CM Oath: విజయ్‌కు బిగ్ షాక్.. గవర్నర్ యూటర్న్.. ఇవాళ ప్రమాణ స్వీకారం లేనట్లే!
మరోవైపు ఫోర్జరీ లెటర్ ఆరోపణలను టీవీకే (TVK) పార్టీ తీవ్రంగా ఖండించింది. ఏఎంఎంకే నాయకుడు కామరాజ్ తమ పార్టీకి మద్దతు ఇచ్చారని పేర్కొంటూ ఒక వీడియోను సైతం విడుదల చేసింది. ఈ విషయానికి సంబంధించిన వాస్తవాలను దాచిపెడుతూ.. దినకరన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని టీవీకే మండిపడింది. ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ స్వచ్ఛందంగా, సంతోషంగా తన మద్దతును ప్రకటిస్తూ లేఖను రాస్తున్న దృశ్యాలు.. ఆ వీడియోలో ఉన్నాయి. టీటీవీ దినకరన్ ఆమోదంతోనే తాను తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ మద్దతు ఇస్తున్నట్లు కూడా ఎమ్మెల్యే కామరాజు పేర్కొన్నట్లు విజయ్ పార్టీ చెప్పుకొచ్చింది.
#WATCH | TVK shares a video of AMMK MLA Kamaraj, saying "These are the video visuals of AMMK MLA Kamaraj voluntarily and happily writing a letter expressing his support for the Tamilaga Vettri Kazhagam. He had stated that he was extending support to the Tamilaga Vettri Kazhagam… pic.twitter.com/sM3xtyXx12
— ANI (@ANI) May 8, 2026