Janasena MPTC Candidate: కౌంటింగ్ వేళ జనసేన పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. కంటికి రెప్పలా చూసుకునే కుటుంబానికీ, ఎన్నికల బరిలో నిలిచిన పార్టీ వర్గానికి ఎనలేని శోకాన్ని మిగిల్చింది ఓ యువ అభ్యర్థి హఠాన్మరణం.
తీవ్ర దిగ్భ్రాంతిలో కుటుంబం, శ్రేణులు
తూర్పగోదావరి జిల్లా దుమంతునిగూడెం MPTC జనసేన అభ్యర్థి గారపాటి దివ్య (25) గుండె సంబంధిత సమస్యతో అకస్మాత్తుగా కన్నుమూశారు. రేపే MPTC, ZPTC ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉండగా.. అంతలోనే ఈ విషాదం చోటుచేసుకోవడం స్థానికంగా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
చిన్న వయసులోనే అంతులేని దుఃఖం
దివ్యకు భర్తతో పాటు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. రేపటి కౌంటింగ్ ఫలితాల కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో.. 25 ఏళ్ల చిన్న వయసులోనే ఆమె మరణించడం కుటుంబ సభ్యులను శోకసంద్రంలో ముంచెత్తింది. జనసేన నాయకులు, కార్యకర్తలు ఆమె నివాసానికి చేరుకుని నివాళులర్పించడంతో పాటు, కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు.
Also Read:ప్రయాణికులకు దీపావళి ధమాకా.. భారీగా తగ్గిన మెట్రో, ఆర్టీసీ జాయింట్ పాస్‌ల ధరలు!