Tiger Attack: ఈ మధ్య కాలంలో పెద్దపులి దాడులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అయితే నంద్యాల జిల్లాలో పెద్దపులి దాడి కలకలం రేపుతోంది. నల్లమల అడవులకు సమీపంలో ఉన్న సదరం పెంట చెంచుగూడానికి చెందిన ఓ యువకుడిపై దాడి పెద్దపులి చేసింది.
పొలానికి వెళ్లిన యువకుడిపై దాడి చేసిన పెద్దపులి
రోజులాగే యువకుడు పొలానికి వెళ్లాడు. ఆ రోజు పొలానికి మందు కొడతాం అని అనుకుని చూస్తుండగా.. అక్కడే పొదల చాటుగా ఉన్న పెద్దపులి ఒక్కసారిగా అతనిపై దాడి చేసింది. దీంతో వెంటనే పులి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయిన కుదరక పోవడంతో.. గట్టిగ కేకలు పెట్టడంతో ఆ యువకుడి మామ అక్కడికి వచ్చాడు.
తీవ్ర గాయాలతో పులి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిన యువకుడు
అలాగే అక్కడి ప్రజలు కూడా గట్టిగా అరుస్తూ అక్కడికి వస్తుండగా.. పులి అక్కడి నుంచి పారిపోయింది. అప్పుడు ఆ యువకుడి హమ్మయ్య బతికాను రా.. దేవుడా అని ఊపిరి పిల్చుకున్నాడు. పులి దాడిలో తీవ్ర యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు అక్కడి సమీపంలోని ఆత్మకూరు ఆసుపత్రిలో బాధితుడిని చేర్చారు.
భయాందోళనలో గిరిజనులు..
ఈ ఘటనతో నల్లమల అడవుల సమీపంలోని గిరిజన గూడాల్లో నివసిస్తున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులి దాడి కారణంగా స్థానికులు, ముఖ్యంగా గిరిజన సముదాయాలు, తమ రోజువారీ కార్యకలాపాలకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
Also Read: డేంజర్‌లో పాకిస్తాన్.. మునిగిన ప్రధాని ఇల్లు
జాగ్రత్తలు
స్థానికులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా అడవులకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లో ఒంటరిగా వెళ్లకుండా ఉండాలని అటవీ శాఖ సూచిస్తుంది. అటవీ శాఖ అధికారులు పెద్దపులి కదలికలను పర్యవేక్షించడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలను నివారించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.