Pakistan Floods: పాకిస్థాన్‌లో గత వారం రోజులుగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాక్ రాజధాని అయిన ఇస్లామాబాద్ అంతా కూడా నీళ్లలో మునిగిపోయింది. ప్రధాన జాతీయ రహదారులు కూడా నదులను తలపిస్తున్నాయి. దీంతో పాకిస్థాన్ పరిస్థితి గణనీయంగా మారింది. ఇప్పటికే చాలా మంది జాడా కూడా గల్లంతయినట్లు తెలిపారు. అయితే చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు అన్ని వరదలుగా మారి ఉప్పొంగి ప్రవహిస్తుంది. మరోవైపు అనేక మంది స్థానికులు, పర్యాటకులు వరద నీటిలో కొట్టుకుపోయి చనిపోతున్నారు. అయితే ఈ ఘటన నుంచి రెస్క్యూ టీమ్స్ వారు ఇప్పటికే చాలా మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం పాకిస్థాన్ అధికారులు అంతా కూడా రెడ్ అలర్ట్, ఎమర్జెన్సీ ప్రకటించారు.
అయితే 2025 జూలైలో పాకిస్తాన్‌లో కురిసిన భారీ మాన్సూన్ వర్షాలు దేశవ్యాప్తంగా తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి, ముఖ్యంగా పంజాబ్ ప్రావిన్స్‌లో. ఈ వర్షాలు, వరదల కారణంగా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు, వేలాది మంది గాయపడ్డారు, అనేక గ్రామాలు, పట్టణాలు నీటమునిగాయి. జూన్ చివరి నుంచి జూలై 20 వరకు, సుమారు 200 మంది మరణించినట్లు అధికారులు ప్రకటించారు.. ఇందులో వంద మంది చిన్నారులు ఉన్నారు. పంజాబ్‌లో ఒక్క రోజులోనే 63 మంది మరణించారు, 290 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు కారణం ఎక్కువగా కూలిన భవనాల కింద చిక్కుకోవడం లేదా విద్యుత్ షాక్‌ల వల్ల అని తెలిపారు.
ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో స్వాత్ లోయలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది వరదల్లో కొట్టుకుపోయారు, వీరిలో ఏడుగురి మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి, అయితే నీటి ప్రవాహం ఉధృతి కారణంగా రెస్క్యూ ఆపరేషన్లు సవాలుగా మారాయి. సింధ్, బలూచిస్తాన్ ప్రాంతాల్లో కూడా వరదలు తీవ్రంగా ప్రభావితం చేశాయి, 80 లక్షల మంది ప్రజలు ఇప్పటికీ నీటిలో చిక్కుకున్నారు.
Also Read: మద్యం కుంభకోణం సొమ్ముతో మాఫియా ముఠా జల్సా..
అలాగే పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ఇల్లు కూడా వర్షం నీటిలో మునిగిపోయిందని సమాచారం. అంతేకాకుండా ప్రభుత్వం, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) సహాయక చర్యలను వేగవంతం చేస్తున్నాయి, కానీ ఆహారం, నీరు, వైద్య సౌకర్యాల కొరత వంటివి అందించడానిక సవాళ్లుగా ఉన్నాయి.