BigTV English

Nidhhi Agerwal: ది రాజాసాబ్ లో నా పాత్ర అదే.. క్లారిటీ ఇచ్చిన నిధి అగర్వాల్!

Nidhhi Agerwal: ది రాజాసాబ్ లో నా పాత్ర అదే.. క్లారిటీ ఇచ్చిన నిధి అగర్వాల్!

Nidhhi Agerwal: ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhhi Agerwal) ఈ మధ్య వరుస పెట్టి పాన్ ఇండియా చిత్రాలలో అవకాశం అందుకుంటోంది. అందులో భాగంగానే క్రిష్ జాగర్లమూడి (Krish jagarlamudi), జ్యోతి కృష్ణ(Jyoti Krishna) దర్శక ద్వయంలో వచ్చిన హరిహర వీరమల్లు(Harihara Veeramallu) సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా జూలై 24వ తేదీన విడుదల కాంబోతున్న నేపథ్యంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ పలు విషయాలు పంచుకుంటోంది. అందులో భాగంగానే తాను నటిస్తున్న మరో చిత్రం ‘ది రాజా సాబ్’.. ఈ మూవీపై పలు కామెంట్లు చేసిన ఈమె అందులో తన పాత్ర గురించి కూడా వెల్లడించింది.


ది రాజా సాబ్ సినిమాలో కూడా..

అసలు విషయంలోకి వెళ్తే.. ఒకవైపు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాలో నటిస్తూనే.. మరొకవైపు ప్రభాస్ (Prabhas), మారుతి (Maruti) కాంబినేషన్లో వస్తున్న ‘ది రాజా సాబ్’సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాలో ఈమెతో పాటు మాళవిక మోహనన్(Malavika mohanan), రిద్దీ కుమార్ (Riddhi kumar) కూడా హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచేసిన విషయం తెలిసింది. ఇప్పుడు ఈ సినిమాలోని తన పాత్ర పై ఓపెన్ అయ్యింది నిధి అగర్వాల్.


ది రాజా సాబ్ సినిమాలో తన పాత్ర పై నిధి క్లారిటీ..

తాజాగా హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న నిధి అగర్వాల్ మాట్లాడుతూ.. “ది రాజా సాబ్ సినిమా మారుతి డైరెక్షన్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఇంకొన్ని పాటలు, షూటింగు పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాలో నేను నన్, ఏంజెల్ పాత్ర పోషిస్తున్నాను. అయితే దెయ్యం పాత్రలో నేను చేయడం లేదు” అంటూ వెల్లడించింది. మొత్తానికైతే తన పాత్ర పై క్లారిటీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది.

నిధి అగర్వాల్ కెరియర్..

నిధి అగర్వాల్ కెరియర్ విషయానికి వస్తే.. 1993 ఆగస్టు 17న హిందీ మాట్లాడే మార్వాడి కుటుంబంలో హైదరాబాదులో జన్మించి, బెంగళూరులో పెరిగింది. తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో మంచి ప్రావీణ్యం ఉంది. విద్యా శిల్ప్ అకాడమీ విద్యానికేతన్ పాఠశాలల్లో విద్యను పూర్తి చేసిన ఈమె.. బెంగళూరులోని క్రైస్ట్ విశ్వవిద్యాలయం నుండి బిజినెస్ మేనేజ్మెంట్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. నృత్య రూపకాలు, కథక్, బెల్లీ డాన్స్ లలో శిక్షణ కూడా పొందింది. 2017లో టైగర్ ష్రాఫ్ హీరోగా వచ్చిన ‘మున్నా మైఖేల్’ సినిమాల ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. 2018లో ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత పలు తమిళ్ చిత్రాలలో నటించిన ఈమె.. తెలుగులో హీరో, మిస్టర్ మజ్ను సినిమాలో చేసింది. ఇక ఇప్పుడు హరిహర వీరమల్లు, ది రాజా సాబ్ సినిమాలు లైన్ లో పెట్టింది ఈ ముద్దుగుమ్మ.

also read:Tanikella Bharani: మరోసారి భక్తి చాటుకున్న తనికెళ్ల భరణి.. ఆడియో సాంగ్ ఆవిష్కరణలో!

Related News

OG Tickets : పీవీఆర్ థియేటర్ యాజమాన్యంతో పవన్ ఫ్యాన్స్ గొడవ.. అసలు ఏమైంది?

OG Film : రాజమౌళి, ప్రశాంత్ నీల్, అకిరానందన్.. ఈ రాత్రికి ఇండస్ట్రీ మొత్తం ఆ థియేటర్లోనే!

OG Movie: రెండు భాగాలుగా ‘ఓజీ’ మూవీ.. హీరో మాత్రం పవన్‌ కాదు.. మరెవరంటే!

Kantara Chapter1: ఓజీను తొక్కేసిన కాంతార… రిషబ్ కు ఉన్న క్రేజ్ పవన్ కు లేదా ?

OG Movie: వెయిట్… ప్రీమియర్స్ షో టికెట్స్ ధరలు తగ్గుతున్నాయి

Pawan Kalyan: రజినీ తరువాత పవన్ కే ఆ ఘనత.. అది ఆయన రేంజ్

Anaconda Trailer: అనకొండ మళ్లీ వస్తుంది.. ఈసారి సస్పెన్స్‌తో పాటు కామెడీ కూడా.. తెలుగు ట్రైలర్‌ చూశారా?

Sonu Sood: బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్… ఈడీ విచారణకు హాజరైన సోనూ సూద్

Big Stories

×