
Mrunal Thakur: అందాల నటి మృణాల్ ఠాకూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

సీతారామం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది.

ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.

అయితే ఇప్పుడు మరొక మూవీతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమైంది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండకి జోడీగా ఫ్యామిలీ స్టార్ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ మూవీ రేపు అనగా ఏప్రిల్ 5న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఫ్యామిలీ స్టార్ వేడుకల్లో తన సోదరి, అమ్మానాన్నలతో కలిసి దర్శనమిచ్చింది.

ఈ మేరకు తన ఫ్యామిలీతో కలిసి ఈ ఈవెంట్‌కు రావడం మ్యాజిక్‌లా అనిపిస్తుందని తెలిపింది.

ఈ మూవీ వేడుకలో తన కుటుంబంతో కలిసి పాల్గొనడం చాలా స్పెషల్ అనిపిస్తోందని తెలిపింది.

తెలుగు సినీ ప్రేక్షకులు, అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపింది.