BigTV English

Aadhaar Camps: చిన్నారులకు ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లు, ఎక్కడ?

Aadhaar Camps: చిన్నారులకు ప్రత్యేకంగా ఆధార్ సెంటర్లు, ఎక్కడ?

Aadhaar Camps:  మీ ఇంట్లో చిన్నారులు ఉన్నారా? ఒక్క క్షణం ఆలోచించండి. ఎందుకంటే ప్రభుత్వం రెండు విడతలుగా ఆధార్ క్యాంపులను నిర్వహిస్తోంది. ఈ అవకాశాన్ని చిన్నారుల పేరెంట్స్ తప్పక నియోగించుకోవాలి. ముఖ్యంగా ఆరేళ్ల లోపు చిన్నారులు తప్పనిసరి. ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నారు అధికారులు.


ఏపీలో చిన్నారులకు ప్రత్యేకంగా ఆధార్ క్యాంపులు నిర్వహిస్తోంది ప్రభుత్వం. రెండు విడ‌త‌లుగా ఈ క్యాంపులు నిర్వహించనున్నారు. తొలుత మార్చి 19- 22 వరకు, రెండో విడ‌త‌ మార్చి 25-28 వ‌ర‌కు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చిన్నారుల‌కు ఆధార్ న‌మోదుతోపాటు అప్‌డేట్ చేయించుకునేందుకు ఈ అవ‌కాశం క‌ల్పించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో వీటిని చేపడుతున్నారు.

ఏపీ వ్యాప్తంగా 11,65,264 మంది చిన్నారులు ఉన్నారు. వారిలో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్లు ఉండి ఆధార్ లేని ఆరేళ్లలోపు చిన్నారులు దాదాపు 1,86,709 ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో చిన్నారుల‌కు ఆధార్ న‌మోదు చేసేందుకు ప్రత్యేక ఆధార్ క్యాంపుల‌ను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి అన్ని జిల్లాల క‌లెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.


వేరే ప్రాంతాలకు బదిలీపై వెళ్లడం, ఇతర రాష్ట్రాల్లో స్థిర నివాసాలు ఏర్పటు చేసుకోవడం వంటివి ఉన్నాయి. ఇతర కారణాల వల్ల ఆధార్ కార్డులు తీసుకోలేకపోయినట్లు తేలింది. జియో ట్యాగింగ్ ప్రక్రియలో వీరి వివరాలు చూపించక పోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో జనన ధ్రువీకరణ పత్రాలు ఉన్న చిన్నారులందరి వివరాలతో ఆధార్ పొందేందుకు ఈ నెలలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తోంది.

మండ‌లంలో చిన్నారులు ఎంత‌మంది ఉన్నారు? వారిలో ఎంత మంది చిన్నారులు ఆధార్ న‌మోదు చేసుకోలేదు? ఎంపీడీవోలు అంగ‌న్‌వాడీ కేంద్రాల ద్వారా, స‌చివాల‌యాల ద్వారా డేటాను సేక‌రించి, ఎక్కడెక్కడ ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలనే దానిపై ప్రణాళిక రెడీ చేసింది. అందుకు అనుగుణంగా ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేస్తోంది.

సెంటర్ కి వెళ్లేటప్పుడు

ద‌ర‌ఖాస్తు ఫారం ఉండాలి

ఆధార్ న‌మోదుకు క్యూర్ కోడ్ ఉన్న పుట్టిన తేదీ స‌ర్టిఫికెట్ చిన్నారుల‌కు ఉండాలి

త‌ల్లి లేదా తండ్రి మాత్రమే చిన్నారులను ఆధార్ క్యాంప్‌కు తీసుకెళ్లాలి

మిగతా వారికి తీసుకెళ్లినా ఎలాంటి ఫలితం ఉండదు

ఆధార్ సెంట‌ర్‌కు తీసుకెళ్లే వారి త‌ల్లి లేదా తండ్రి ఆధార్ కార్డును త‌ప్పనిస‌రి

చిన్నారుల ఆధార్ న‌మోదుకు ఎలాంటి రుసుము లేదు. అంతా ఉచిత‌మే

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×