BigTV English

IPL 2025: నాలుగు రోజుల్లోనే ఐపీఎల్‌ 2025.. టైమింగ్స్‌, ఉచితంగా చూడాలంటే ఎలా ?

IPL 2025: నాలుగు రోజుల్లోనే ఐపీఎల్‌ 2025.. టైమింగ్స్‌, ఉచితంగా చూడాలంటే ఎలా ?

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈసారి.. ప్లేయర్లందరూ.. మారిపోయారు. కొత్త కెప్టెన్లు కూడా కొన్ని జట్లకు మారిపోవడం జరిగింది. గతంలో కంటే ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ చాలా భిన్నంగా ఉంటుంది. దీంతో ఈ మ్యాచ్ ల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు జనాలు.


Also Read: Shami Daughter: రంజాన్ లో హోలీ.. మహ్మద్ షమీ కూతురిపై ట్రోలింగ్..!

ఐపీఎల్ ఎప్పుడు ప్రారంభం ?


ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మే 25వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉంటుంది. దాదాపు 75 రోజులపాటు… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కొనసాగుతుంది. మొదటి మ్యాచ్… కోల్‌ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ( Eden Gardens ) జరుగుతుంది. ఆ తర్వాత హైదరాబాద్ లో రెండో మ్యాచ్ జరుగుతుంది. గత ఐపీఎల్ 2024 సంవత్సరంలో… కోల్కతా నైట్ రైడర్స్ ( Kolkata Knight Riders ) ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అందుకే మొదటి మ్యాచ్ అలాగే ఈ సారి జరిగే ఫైనల్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో దొరుకుతుంది. హైదరాబాద్ మహానగరంలోని ఉప్పల్ స్టేడియంలో… రెండు నాకౌట్ మ్యాచ్ లు కూడా జరుగుతాయి.

ఉచితంగా చూడాలంటే ఎలా?

మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మ్యాచ్లు జియో హాట్ స్టార్ లో ప్రసారమవుతాయి. జియో హాట్ స్టార్ లో కేవలం జియో కస్టమర్లకు ఉచితంగా ప్రసారాలు అందిస్తున్నారు. ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ సందర్భంగా కూడా.. జియో హాట్ స్టార్ లో ఉచితంగా ప్రసారమయ్యాయి. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కూడా జియో హాట్ స్టార్ లో ఉచితంగా వస్తుంది. క్రిక్ బజ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా మనం చూసుకోవచ్చు.

Also Read: Yuvraj Singh: విండీస్ ప్లేయర్ యూవీ దాడి.. 2007 ఫైట్ రిపీట్ !

మొదటి మ్యాచ్ ఎవరి మధ్య?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మొదటి మ్యాచ్ కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ చాలెంజెస్ బెంగళూరు ( Kolkata Knight Riders vs Royal Challengers Bangalore ) మధ్య ఫైట్ జరగనుంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత మార్చి 23వ తేదీన సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals ) మధ్య రెండో మ్యాచ్ ఉంటుంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో మ్యాచ్‌ లు సాయంత్రం 7 గంటల తర్వాత ప్రారంభం కానున్నాయి. రెండు మ్యాచ్‌ లు ఉంటే… మధ్యాహ్నం 3 గంటల తర్వాత, అలాగే… సాయంత్రం 7 గంటల తర్వాత ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి అన్ని ఏర్పాట్లు చేసింది.

Related News

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Night watchman : టెస్ట్ క్రికెట్ లో అసలు నైట్ వాచ్మెన్ అంటే ఎవరు.. వాళ్ల డ్యూటీ ఏంటి

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Big Stories

×