Jubilee Hills Car Incident: హైదరబాద్ జూబ్లిహిల్స్ లో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. గడిచిన నెలరోజుల వ్యవధిలో పలువురు రోడ్డు ప్రమాదాలకు గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అతిగా మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేయడం.. ఆ తర్వాత ప్రమాదాలు చేయడం.. ఇటీవల బాగా కామన్ అయిపోయుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో సోమవారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. కృష్ణానగర్ నుంచి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తుండగా మెట్రో పిల్లర్‌ను ఆపై డినవైడర్‌ను ఢీకొట్టి రోడ్డుకు అడ్జంగా నిలిచిపోయింది. వేగంగా ఢీకొట్టడంతో కారు టైరు ఊడిపోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలు కావడంతో దవాఖానకు తరలించారు. మద్యం మత్తులో కారు నడిపినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఒక్కసారిగా కారు ప్రమాదానికి గురికావడంతో వాహనాదారులు భయాందోళనకు గురయ్యారు.
Also Read: బీజేపీ మాదిరిగా చెయ్యలేదు.. పొట్టి శ్రీరాముల వర్శిటీ పేరు మార్పుపై సీఎం క్లారిటీ
ఇదిలా ఉంటే.. ఇటీవల జూబ్లిహిల్స్ రోడ్డు నెంబర్ వన్‌లో ఉన్న సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఇంటిముందు ఉన్న ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. అతివేగంగా వస్తున్న కారును చూసి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని.. పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రమాదంలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయ్యాయి. ఫెన్సింగ్ తో పాటు కారు ముందుభాగం ధ్వంసం అయింది. కారు మాదాపూర్ నుంచి జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళుతుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. కాగా డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు.