BigTV English

Mumbai actress case: ముంబై నటి కేసు.. దర్యాప్తులో ఏసీపీ స్రవంతి.. రాత్రంతా, ఇపీఎస్‌లకు ఇబ్బందులు

Mumbai actress case: ముంబై నటి కేసు.. దర్యాప్తులో ఏసీపీ స్రవంతి.. రాత్రంతా, ఇపీఎస్‌లకు ఇబ్బందులు

Mumbai actress case: ముంబై నటి వ్యవహారంపై పూర్తిస్థాయిలో ఏపీ సర్కార్ ఫోకస్ చేసిందా? జగన్ సర్కార్ అడ్డంగా బుక్కయ్యిందా? వైసీపీ నేతలతోపాటు ఐపీఎస్‌ల చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? విచారణ అధికారిగా ఏసీపీ స్రవంతి‌రాయ్ నియమించడం, రాత్రంతా దీనికి సంబంధించి డీటేల్స్ స్టడీ చేసే పనిలో పడ్డారు.


ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈమెని వైసీపీ నేతలు, ఐపీఎస్ అధికారులు వేధింపుల ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. చిత్రహింసలు పెట్టిన కేసులో ఐపీఎస్‌ల పాత్ర తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగానే ఏసీపీ స్రవంతి రాయ్ రంగంలోకి దిగేశారు.

ఈ కేసుకు సంబందించి మొదటి నుంచి ఇప్పటివరకు సంబంధించిన  వివరాలను అధికారుల నుంచి తీసుకున్నారు. ఇప్పటికే విజయవాడకు చేరిన ముంబై నటి.. శుక్రవారం ఉదయం విజయవాడ సీపీ, ఏసీపీ స్రవంతిరాయ్‌లను కలవనుంది. ఆమెతోపాటు ఫ్యామిలీ సభ్యులు వస్తున్నట్లు సమాచారం. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపి కేవలం నాలుగు రోజుల్లో ఏసీపీ స్రవంతిరాయ్ నివేదిక ఇవ్వనున్నారు.


ALSO READ:  జైత్వానీ కేసులో మరో అప్డేట్.. నేడు హైదరాబాద్‌కు రానున్న..

నటిని వేధించిన వ్యవహారంలో ప్రధానంగా అందరి చూపు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై పడింది. సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. పోస్టింగులు దక్కని ఐపీఎస్ అధికారులు ప్రతీరోజూ ఆఫీసుకు రావాలని డీజీపీ వారం కిందట ఆదేశించారు.

నటి వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత కాంతి రాణాతోపాటు పోస్టింగుల కోసం వెయిట్ చేస్తున్న ఐపీఎస్ అధికారులు డీజీపీ ఆఫీసుకు రాలేదని తెలుస్తోంది. ఇంతకీ రాణా విజయవాడలో ఉన్నారా? లేక ఎక్కడికైనా వెళ్లారా అనేది ఆసక్తికరంగా మారింది. స్వయంగా డీజీపీ ఆదేశాలను లెక్కచేయకపోవడంతో ఆయనపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీసు శాఖ సిద్ధమైంది.

ఇక ఏసీపీ స్రవంతిరాయ్ విషయానికొద్దాం. ఆమె సమర్థమైన అధికారిణిగా పేరు సంపాదించుకున్నారు. డీఎస్పీగా ఉన్న సమయంలో ఎవరికీ లొంగేవారు కాదని ముద్ర ఆమెపై ఉంది. ఆ నేపథ్యంలో స్రవంతిరాయ్‌ని విచారణ అధికారిగా నియమించారు ఉన్నతాధికారులు. కేవలం నాలుగు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు.

గతరాత్రి కేసుకు సంబంధించిన ఫైళ్లను ఏసీపీ తిరగేశారు. నటి జెత్వానీ ఏడాది ఫిబ్రవరి రెండున విజయవాడకు వచ్చిన దగ్గర నుంచి ముంబైకి విమానంలో తీసుకెళ్లే వరకు మినిట్ టు మినిట్ ఏం జరిగిందనే దానిపై అంతా రెడీ చేసుకున్నారు. దాదాపు 40 రోజులపాటు తనను నిర్భధించి హించారన్నది ఆ నటి ప్రధాన ఆరోపణ.

గతరాత్రి ముంబై నుంచి హైదరాబాద్ కు చేరుకుంది ముంబై నటి. రాత్రి 9 గంటల నుంచి అర్థరాత్రి వరకు ఆమె ఎయిర్ పోర్టులో ఉండిపోయింది. అర్థరాత్రి తర్వాత మీడియా ముందుకొచ్చింది. గత పాలనలో కొందరు తన పట్ల అమర్యాదగా ప్రవర్తించారని, ముఖ్యంగా పోలీసులు దారుణంగా చిత్రహంసలకు గురి చేశారని వాపోయింది. ఈ వ్యవహారంపై తన వద్దనున్న ఆధారాలను అధికారులకు అందజేస్తానని వెల్లడించింది.

ఫ్యామిలీ సభ్యులను సోషల్‌మీడియా వేదికగా కించపరుస్తూ ఆరోపణలు చేయడం, ఈ విషయంలో ఏపీ సర్కార్ తనకు న్యాయం చేస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత అక్కడి నుంచి పోలీసుల భద్రతతో విజయవాడకు చేరుకుంది. ప్రస్తుతం ఆమె విజయవాడలో ఉంది. తొలుత విజయవాడ సీపీని కలవనుంది. ఆ తర్వాత ఏసీపీ స్రవంతిరాయ్‌తో సమావేశమై వేధింపులకు సంబంధించిన డీటేల్స్ అందజేయనుంది.

Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×