BigTV English
Advertisement

US Man Poisons Wife: భార్యకు స్లో పాయిజన్ ఇచ్చిన 71 ఏళ్ల భర్త.. అంతా కూతురి మాస్టర్ ప్లాన్!

US Man Poisons Wife: భార్యకు స్లో పాయిజన్ ఇచ్చిన 71 ఏళ్ల భర్త.. అంతా కూతురి మాస్టర్ ప్లాన్!

US Man Poisons Wife| ఒక 71 ఏళ్ల ముసలి వ్యక్తి తన భార్యకు గత రెండు సంవత్సరాలుగా కొద్ది కొద్దిగా విషం ఇస్తున్నాడు. భార్య చనిపోతే.. ఆమె కూతురిని వివాహం చేసుకోవచ్చని అతని ప్లాన్. అయితే విధి అతనికి వ్యతిరేకంగా పనిచేసింది. ఆ ముసలి భర్త పట్టుబడ్డాడు. కోర్టులో తన నేరం అంగీకరించాడు. కానీ కోర్టు విచారణలో షాకింగ్ విషయాలు తెలిశాయి. ఇదంతా అతని భార్య కూతురి ప్లాన్ అని బయటపడింది. కోర్టు అతనికి నాలుగేళ్ల జైలు శిక్ష మాత్రమే విధించింది. అతని భార్య కూతురు ప్రస్తుతం పరారీలో ఉంది. ఈ ఘటన అమెరికా లో మిచిగాన్ రాష్ట్రంలో జరిగింది.


పోలీసుల కథనం ప్రకారం.. మిచిగాన్ రాష్ట్రంలోని వేన్ కౌంటీ ప్రాంతంలో నివసించే 71 ఏళ్ల ఆల్ఫ్రెడ్ రుఫ్ అనే వ్యక్తికి అయిదేళ్ల క్రితం ఏంజలీనా (66) తో వివాహం జరిగింది. అప్పటికే ఏంజలీనాకు తన మొదటి భర్తతో షెరిల్ (38) ఒక కూతురు ఉంది. ఆమె విడిగా తన స్నేహితురాలితో కొంత దూరం నివసిస్తోంది.

ఈ క్రమంలో ఆల్ఫ్రెడ్ భార్య ఏంజలీనాకు 2021 నవంబర్, డిసెంబర్ లో అరోగ్య సమస్యలు వచ్చాయి. ఆమె పలుమార్ల ఆస్పత్రిలో చేరింది. అయితే ఆస్పత్రిలో ఆమె కు రక్త పరీక్ష చేస్తే.. ఆమె రక్తంలో నిషేధిత డ్రగ్స్ ఉన్నట్లు తేలింది. కానీ ఏంజలీనాకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదు. ఏదో పొరపాటు జరిగి ఉంటుందని అనుకొంది. ఆ తరువాత ఏంజలీనా ఆరోగ్యం మెరుగుపడింది.


అయితే 2022 జనవరిలో తిరిగి ఏంజలీనాకు మళ్లీ అనారోగ్యం చేసింది. తరుచూ వాంతులు కావడం, తలనొప్పి, విరేచనాలు, అలసిపోయినట్లు ఉండడంతో మళ్లీ ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ తన రక్తంలో కొకెయిన్, ఎండిఎంఏ లాంటి మళ్లీ నిషేధిత డ్రగ్స్ ఉన్నట్లు రక్త పరీక్ష రిపోర్ట్ లో తేలింది. డాక్టర్లు ఆమె తీసుకునే ఆహారంలో ఈ డ్రగ్స్ ఉండవచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఏంజెలీనా ఇంటికి వెళ్లి తన భర్తను నిలదీసింది. తనకు నిజమేంటో తెలియాలని గట్టిగా ప్రశ్నించింది.

Also Read:  ‘నా ఇష్టం మీకేంటి?’.. 16 ఏళ్ల అబ్బాయిని డేట్ చేస్తున్న 21 ఏళ్ల భామ..

భార్య అడిగే ప్రశ్నలకు ఆల్ఫ్రెడ్ నిజం చెప్పేశాడు. తనకు ఇష్టం లేకపోయినా తన చేత ఈ పనిచేయించింది.. మరెవరో కాదు ఏంజలీనా కూతరు షెరిల్ అని చెప్పేశాడు. ఏంజలీనా చనిపోతే.. ఆమె మొదటి భర్త ఆస్తి మొత్తం షెరిల్ పేరున వస్తుందని భావించిన షెరిల్ తన తల్లి రెండో భర్తతో ప్రేమాయాణం నడిపింది. ఈ క్రమంలో షెరిల్, ఆమె స్నేహితురాలు తండ్రి లాంటి ఆల్ఫ్రెడ్ తో సంబంధం పెట్టుకున్నారు. అందుకే షెరిల్ తనను పెళ్లిచేసుకోవాలంటే.. ముందుగా ఏంజిలీనా ని మెల్లగా హత్య చేసేందుకు ఆల్ఫ్రెడ్ చేతికి తెల్లని పౌడర్ రూపంలో డ్రగ్స్ ఇచ్చింది. తన తల్లి ఏంజలీనా ఆహారంలో కలిపి ఇవ్వాలని ఆల్ఫ్రెడ్ కు చెప్పింది.

ఆల్ఫ్రెడ్ కూడా షెరిల్ ప్రేమలో పడి ఆమె చెప్పినట్లు ఏంజలీనా తీసుకునే పాలు, జ్యూస్ లాంటి డ్రింక్స్ లో డ్రగ్స్ పౌడర్ ని కలిపేసే వాడు. లోలోపల ఆల్ఫ్రెడ్ కు తన భార్యకు చంపాలనే ఉద్దేశం లేదు. అందుకే షెరిల్ చెప్పిన మోతాదు కంటే తక్కువ మోతాదు ఇచ్చేవాడు. కానీ చివరిక తాను చేస్తున్నది తప్పు అని గ్రహించిన ఆల్ఫ్రెడ్.. తన భార్య అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక.. నిజం చెప్పేశాడు.

ప్రస్తుతం వేన్ కౌంటీ కోర్టు.. ఆల్ఫ్రెడ్ తన భార్యను చంపాలని ప్రయత్నించలేదని, కానీ తన భార్య కూతురి కుట్రలో పాల్పంచుకున్నాడని చెబుతూ.. అతడికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో ఏంజలీనా మొదటి భర్త కూతురు, ఆమె స్నేహితురాలు ఆచూకీ ఇంతవరకూ తెలియలేదు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

Also Read: ఫోన్లో ప్రియుడితో మాట్లాడుతుండగా పట్టుబడిన కొత్త పెళ్లికూతురు.. భర్త ఏం చేశాడంటే?

Related News

Srisailam Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం.. మంటల్లో దగ్దమైన కారు.. స్పాట్‌లో 6గురు

Tirupati Crime: ఆ ఫ్యామిలీలో చిచ్చు.. విసిగిపోయిన ఆ తల్లి, పిల్లలతో కలిసి ఆత్మహత్య

Bus Accident: ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన తుఫాన్ వాహనం.. స్పాట్‌లో నలుగురు

Road Accident: పెళ్లి కారు టైరు పేలి‌.. ముగ్గురు స్పాట్‌డెడ్‌

Road Accident: డివైడర్‌ను ఢీకొట్టిన కారు.. మంటల్లో తగలబడి.. 8 మంది స్పాట్!

Patancheru Tollgate: ఘోర రోడ్డు ప్రమాదం.. పటాన్‌చెరులో ట్యాంకర్‌ బోల్తా..

Hyderabad News: హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆత్మహత్యాయత్నం.. అసలేం జరిగిందంటే..?

TMC MP Kalyan Banerjee: సైబర్ వలకు చిక్కిన ఎంపీ కళ్యాణ్ బెనర్జీ.. ₹55 లక్షల స్వాహా!

Big Stories

×