E-Paper
Advertisement

Actress Namitha Campaign in Visakha: విశాఖలో నమిత ప్రచారం, కూటమిదే గెలుపు

Actress Namitha Campaign in Visakha: విశాఖలో నమిత ప్రచారం, కూటమిదే గెలుపు
Advertisement

Actress Namitha Campaign in Visakha(Political news in AP): ముచ్చటగా మూడోసారి కేంద్రంలో బీజేపీ, ఏపీలో కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు సిటీ నటి, బీజేపీ నాయకురాలు నమిత. ప్రధాని మోదీ చేసిన పనులే ఆ పార్టీని గెలుపిస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సునాయాశమేనని మనసులోని మాట బయటపెట్టారు. మంగళవారం విశాఖలో పలు నియోజకవర్గాల్లో రోడ్ షో, ఇంటింటికీ ప్రచారాన్ని నిర్వహించారు.

విశాఖలో అడుగుపెట్టగానే బీజేపీ కార్యాలయానికి వెళ్లారు నటి నమిత. నేతలతో సమావేశం తర్వాత కార్యకర్తలతో ఫోటోలు దిగారు. అక్కడి నుంచి నేరుగా విశాఖ సౌత్‌లో జనసేన అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా ఇంటింటికి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

Advertisement

ముఖ్యంగా మహిళలతో మాట్లాడుతూ ఈసారి కూటమిదే గెలుపని వ్యాఖ్యానించారు. అలాగే గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి వంశీకృష్ణను గెలపించాలని మహిళలను అభ్యర్థించారు నటి నమిత.

Actress Namitha Campaign in Visakha south for NDA Candidates
Actress Namitha Campaign in Visakha south for NDA Candidates

భీమిలి నియోజకవర్గంలోని అమనాం, మజ్జివలన, మజ్జిపేట ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావుతో కలిసి రోడ్ షో నిర్వహించారు నమిత. జనం భారీగా రావడంతో ఖుషీ అయ్యారు. గత ప్రభుత్వాన్ని చూశామని, పాలన ఎక్కడా కనిపించలేదన్నారు. ఈసారి కూటమి అభ్యర్థులను గెలిపిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పుకొచ్చారు. అలాగే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు నమిత.

Related News

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Big Stories

Advertisement
×