BigTV English

Faria Abdullah: పెళ్లి వద్దు కానీ.. పిల్లలు కావాలి: నటి ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్..!

Faria Abdullah: పెళ్లి వద్దు కానీ.. పిల్లలు కావాలి: నటి ఫరియా అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్..!

Faria Abdullah latest comments(Tollywood news in telugu): ఒక్క సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్‌ హోదా సంపాదించుకున్న ఎంతో మంది నటీ నటులు ఉన్నారు. అందులో నటి ఫరియా అబ్దుల్లా ఒకరు. జాతి రత్నాలు సినిమాతో ఓవర్‌నైట్‌లో క్రేజీ హీరోయిన్‌గా పేరు సంపాదించుకుంది. ఇందులో లాయర్ పాత్రలో నటించి కడుపుబ్బా నవ్వించేసింది. ఆమె పాత్ర ప్రేక్షకులకు బాగా నచ్చేసింది.


అందువల్ల తన మొదటి సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఇక ఈ మూవీ తర్వాత తనకు బోలెడన్ని సినిమా ఆఫర్లు వచ్చి పడ్డాయి. అక్కినేని నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో ప్రత్యేక సాంగ్‌లో నటించి అదరగొట్టేసింది. అలాగే మాస్ మహారాజ రవితేజ నటించిన రావణాసురలో కూడా నటించి మెప్పించింది.

ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ క్రమంలోనే నటుడు అల్లరి నరేష్‌తో ‘ఆ ఒక్కటి అడక్కు’ అనే సినిమాలో నటించింది. ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే ఈ మూవీ మంచి రెస్పాన్స్‌తో దూసుకుపోతుంది. ఇప్పటికీ ఈ మూవీ రూ.3కోట్లకు పైగా కలెక్షన్లతో అదరగొడుతోంది.


Also Read: ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ రివ్యూ.. ఈ సారి అల్లరోడు అలరించాడా..?

ఇక ఈ మూవీకి వస్తున్న రెస్పాన్స్‌ చూసి చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తుంది. ఇందులో భాగంగా సినిమా సక్సెస్ టాక్‌ అందుకోవడంతో టాల్ గర్ల్ ఫరియా అబ్దుల్లా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో తన పెళ్లి, పిల్లలకు సంబంధించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ఫరియా.. తనకు పెళ్లి వద్దు కానీ.. పిల్లలు మాత్రం కావాలని చెప్పి అందరినీ షాక్‌కు గురి చేసింది.

ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తనకు తన మ్యారేజ్‌పై నమ్మకం లేదని తెలిపింది. ఒకవేళ అయినా అవ్వొచ్చని చెప్పింది. కచ్చితంగా చెప్పాలంటే తనకు పెళ్లిపై ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని తెలిపింది. కానీ తనకు పిల్లలు అంటే చాలా ఇష్టం అని.. అయితే అమ్మ అవుతానని పేర్కొంది. ఈ మేరకు పెళ్లి గురించి కూడా ఆలోచించాలని తెలిపింది. అయితే ఇక్కడ తండ్రి బాధ్యతలు కూడా ఉండాలని.. ఒక బిడ్డని తల్లీ తండ్రి కలిసి పెంచితేనే బాగుంటుందని చెప్పుకొచ్చింది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదని తెలిపింది. కానీ పెళ్లి విషయానికి వచ్చే సరికి కాస్త ఆలోచించాలని చెప్పింది. దీంతో ఆమె కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Tags

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×