AL Jazeera on Jagan: వైసీపీ అధినేత జగన్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారా? వైసీపీ హయాంలో చేసిన అరాచకాలు బయటకు వస్తున్నాయా? జగన్ ఆలోచనను గమనించిన రాజకీయ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారా? వైసీపీ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ ఎంత డేంజరో అల్ జజీరా మీడియా సెన్సేషనల్ కథనాన్ని ఎందుకు ప్రచురించింది? దీనిపై విదేశీ రాజకీయ నిపుణులు ఏమంటున్నారు? ఇవన్నీ తెలిసే జగన్‌ను.. బీజేపీ దూరంగా పెట్టిందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.
అల్ జజీరా మీడియా ఏదైనా కథనాలను ప్రచురిస్తే ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే ఆ ఛానెల్‌కు అంతపేరుంది. ఆ ఛానెల్ ప్రచురించిన స్టోరీ పరిశీలిస్తే.. జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థపై దాదాపు ఏడాది పాటు పరిశోధన చేసినట్టు కనిపిస్తోంది. తాడేపల్లి మొదలు వాలంటీర్లు, డేటా సేకరణ, దాంతో ఏం చేస్తున్నారు? అనేదానిపై లోతుగా పరిశోధన చేసింది.
అప్పటి జగన్ ప్రభుత్వాన్ని చీల్చిచెండాడింది. ఎన్నికలకు ముందు ప్రజల వ్యక్తిగత డేటా సేకరించిందంటూ సంచలన కథనం వెలువరించింది. దాదాపు 2 లక్షల 60 వేల మంది వాలంటీర్లను నియమించుకుంది. వారి ద్వారా పథకాలు గ్రామాల్లోకి తీసుకెళ్లింది. పార్టీకి అనుకూలంగా లేనివారి సంక్షేమ పథకాలు తొలగించింది.
రైట్ టు ప్రైవసీ అనేది ప్రధానంగా ఉంది. రాజ్యాంగం ప్రసాధించిన హక్కుల్లో అది కూడా ఒకటి. దాన్ని తుంగలో తొక్కింది అప్పటి వైసీపీ సర్కార్. తొలుత సంక్షేమ పథకాలు పేరుతో వారానికి ఒకసారి డేటా తీసుకుందని తేల్చింది. ఫ్యామిలీ మధ్య గొడవలు, ఇంట్లో రిలేషన్ షిప్ ఏమైనా మారాయా? ఇలాంటి విషయాలపై డేటా సేకరించినట్టు రాసుకొచ్చింది.
ALSO READ: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు
సేకరించిన డేటాను క్రోడీకరించడానికి టెండర్ల ద్వారా ఓ ప్రైవేటు సంస్థను పిలిచింది. వాలంటీర్ల వాట్సాప్ గ్రూప్‌లో డేటా క్రోడీకరించే ఏజెన్సీ, స్థానిక వైసీపీ నేతలు అందులో ఉండేవారు. ఆ డేటాను ఐప్యాక్‌తో సంప్రదింపులు చేసేవారట. ఈ విధంగా ప్రతీ ఫ్యామిలీ ఆలోచనను తమ ఆధీనంలోకి తీసుకునే విధంగా ప్లాన్ చేశారన్నమాట.
డిలీట్ చేసిన వాట్సాప్ మేసేజ్‌లను లండన్‌లోని ఓ యూనివర్సిటీ నుంచి బయటకు తీశారు. ఊరులో మార్పు లేంటి? ఓటరు మూడ్ ఎలా ఉంది? వీరిని ఎలా కంట్రోల్ చేయాలని అనేది ప్రతీది వాట్సాప్ మేసెజ్‌ల్లో వెళ్లేంది. సౌతిండియాలో ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వం ఈ విధంగా చేసిందని రాసుకొచ్చింది.
ఒక్కమాటలో చెప్పాలంటే ఎన్నికల వ్యవస్థను సవాల్ చేసింది జగన్ తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థ. ప్రపంచంలో డేటా స్టోరేజ్ ఎక్కువగా ఉండేది కేం బ్రిడ్జి అనలిటికాను మించి డేటాను రెడీ చేసిందని రాసుకొచ్చింది. సైన్స్ ఫిక్షన్ మాదిరిగా సైబర్ నెటిక్స్ ద్వారా వ్యవస్థను ఏర్పాటు చేసింది. అదంతా ప్రభుత్వం నిధులతోనే చేసింది.
అదే యూరప్ దేశాల్లో అత్యంత తీవ్రమైన నేరంగా దీన్ని పరిగణిస్తారు. పొలిటికల్ సైన్స్ డిపార్టుమెంట్‌లో దీనిపై చర్చ జరుగుతోంది. అన్ని చేస్తే కేవలం 11 సీట్లకు ఎందుకు పడిపోయిందన్న దానిపై ప్రస్తావించింది. విపక్షాల ఆందోళన, ఎన్నికలకు వాలంటీర్ల వ్యవస్థను దూరంగా పెట్టడం కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసిందని రాసుకొచ్చింది.
ఎన్నికల ప్రచారంలో ఇదే విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదేపదే చెబుతూ వచ్చారు. 30 వేల మంది మిస్సయ్యారంటూ కేంద్ర నిఘా వర్గాలు స్వయంగా చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. గ్రామంలో ఎవరు ఎటువైపు, కుటుంబంలో సమస్యలు తీసుకుని హూమన్ ట్రాఫికింగ్ జరుగుతోందని పదేపదే పవన్, చంద్రబాబు చెప్పుకొచ్చారు. మరి అల్ జజీరా ఇన్వెస్టిగేషన్ స్టోరీపై చర్యలు తీసుకోవాల్సిందే కేంద్రమే.