AP EX CID chief Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ, సీఐడీ చీఫ్ గా ఆయన పని చేశారు. ఆ టైంలో తన హోదాను అడ్డుపెట్టుకొని కోటి 75 లక్షల రూపాయల నిధుల దుర్వినియోగం చేశారని ఏసీబీ ఆయన్ని ఆరోపించింది. అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, 150 ట్యాబ్‌ల సరఫరా కాంట్రాక్టును ఆయన సౌత్రికా టెక్నాలజీస్ అండ్ ఇన్‌ఫ్రాకు అప్పగించారు.
2023 ఫిబ్రవరి 15న ఒప్పందం కుదరింది. ఒప్పందం అయితే కుదిరింది కానీ.. పనులు మాత్రం జరగలేదు. అయినప్పటికీ ఒప్పంద కుదిరిన వారం రోజుల్లోనే ఆ సంస్థకు 59 లక్షల 93 వేల బిల్లులు చెల్లించారు. అలా చెల్లించడానికి అధికారులపై తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చారని సంజయ్ పై ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనల ప్రకారం అగ్ని-ఎన్వోసీ వెబ్‌సైట్, యాప్ కార్యకలాపాలు ప్రారంభించి, ట్యాబ్‌లన్నీ సరఫరా చేసిన తర్వాత 50 శాతం నిధులు ఇవ్వాలి. ఆ తర్వాత శాఖాపరమైన అంతర్గత సమీక్ష కమిటీ నివేదికను అందిస్తే మరో 25 శాతం చెల్లింపులు జరగాలి. సెక్యూరిటీ ఆడిట్ పూర్తి అయిన తర్వాత 20 శాతం బిల్లులు క్లియర్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 5 శాతం నిధులు ఐదేళ్లలో పూర్తి చేయాలి. కానీ.. ఈ నిబంధనలన్ని పక్కన పెట్టి ఆఘమేఘాల మీద ఆ సంస్థకు నిధులు విడుదల చేశారు.
Also Read: ఏపీలో ప్రక్షాళన.. ఫైబర్ నెట్‌లో 410 మందిపై వేటు
50% పనులు పూర్తిచేసినట్లు సంస్థ ఓ తప్పుడు నివేదిక సమర్పిస్తే దాన్ని కూడా ఆయన ఆమోదించారు. ఇక ల్యాప్‌టాప్, ఐపాడ్‌కు కూడా ఎక్కువ ధరలు చెల్లించారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ జరిపిన విజిలెన్స్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆ నివేదిక ఆధారంగా రాష్ట్రప్రభుత్వం సంజయ్‌ను సస్పెండ్ చేసి ఏసీబీ విచారణకు ఆదేశించింది.
ఇక ఆ తర్వాత సీఐడీ చీఫ్‌గా ఉన్నపుడు ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ నిరోధక చట్టంపై దళితులు, గిరిజనులకు అవగాహన సదస్సుల నిర్వహించారు. ఆ నిర్వహన కాంట్రాక్టును క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌కి కట్టబెడ్టారు. అక్కడ కూడా నిబంధనలను గాలికి ఒదిలేశారు. ఈ కాంట్రాక్టర్లకు ఏకంగా కోటి 15 లక్షలు దోచిపెట్టారు. ఇక్కడ కూడా ఒప్పందం జరిగిన వారం రోజుల్లోనే ఎస్సీల కోసం సదస్సుల నిర్వహణకు నిధులు చెల్లించేశారు.