Amaravati international airport: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఎంత గ్రాండ్‌గా ఉందో చూశాం.. ఇప్పుడు దాని కన్నా ముందే ఆలోచించి, మరింత ముందుకు వెళ్లేందుకు సిద్ధమైనదీ అమరావతి. ఏకంగా 5000 ఎకరాల్లో, 24×7 అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ విషయం తెలిసిన మిగతా రాష్ట్రాలు బిగ్ షాక్ కు గురయ్యాయట. ఇంతకు అసలు విషయం ఏమిటంటే..?
ఏపీకి ది బెస్ట్ ప్రాజెక్ట్..
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌కి వేదిక కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, అమరావతిలో శంషాబాద్ తరహాలో భారీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించేందుకు కేంద్రం అనుమతి కోరనుంది. ఇది కేవలం మాటల ప్రకటన కాదు, గ్రీన్‌ఫీల్డ్ ప్రాజెక్ట్‌గా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించనున్నదిగా అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఈ విమానాశ్రయం కోసం ఇప్పటికే 5,000 ఎకరాల భూమిని గుర్తించినట్టు, 24 గంటలు పనిచేసే ఆల్-వెదర్ ఆపరేషన్స్‌కు అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు చేసే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దీనివల్ల రాష్ట్రానికి పెరుగుతున్న వాణిజ్య, పారిశ్రామిక, పర్యాటక అవసరాలు తీర్చడానికి గగనతల మార్గంలో వేగం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఎయిర్ పోర్ట్ నిర్మాణమే ఓ వండర్..
ప్రస్తుతానికి రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాల్లో విమానాశ్రయాలు ఉన్నప్పటికీ, శాశ్వత రాజధాని అభివృద్ధికి అనుగుణంగా ప్రత్యేకమైన అంతర్జాతీయ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ అవసరమవుతుందన్న అభిప్రాయం అధికార వర్గాల్లో ఉంది. అమరావతి ప్రాంతం పాలిటికల్, అడ్మినిస్ట్రేటివ్ హబ్ కావడంతో పాటు, భవిష్యత్తులో ప్రముఖ పెట్టుబడిదారులకు కేంద్రంగా మారే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడే ఒక ప్రణాళికతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే.. స్వల్ప వ్యవధిలో నేషనల్, ఇంటర్నేషనల్ కనెక్టివిటీ సాధ్యం అవుతుంది. అంతేకాక, నిరంతర ఆపరేషన్‌కి అనువైన వాతావరణం, బిగ్ బాడీ విమానాలకు సరిపడే రన్‌వేలు, హైటెక్ టెర్మినల్స్, కార్గో హ్యాండ్లింగ్ వంటి ఆధునిక సౌకర్యాలు కూడా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు.
ఉద్యోగాలే.. ఉద్యోగాలు!
ఇంకా మరొక ముఖ్య విషయం ఏమిటంటే.. ఈ విమానాశ్రయం ఏర్పడితే వాతావరణ పరంగా కూడా ప్రత్యేకత కలిగి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మౌలిక వసతుల అభివృద్ధి కీలక దశలో ఉన్నందున, ఇది ఉద్యోగావకాశాలు, నిర్మాణ రంగానికి పెద్ద బూస్ట్ ఇవ్వనుంది. నిర్మాణ దశలో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి, తరువాత నేరుగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి.
ఇతర రాష్ట్రాల గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌లను తీసుకుంటే, ఢిల్లీ న్యూ ఎయిర్‌పోర్ట్ అయిన జ్యువార్ (Noida), హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (శంషాబాద్), ముంబైలో నావి ముంబై ప్రాజెక్ట్‌లు వంటి వాటిలా, అమరావతి ఎయిర్‌పోర్ట్ ప్రాజెక్ట్ కూడా దేశ స్థాయిలో గుర్తింపు పొందేలా అభివృద్ధి చేయాలన్నదే లక్ష్యం. అంతర్జాతీయ ప్రామాణికాలకు అనుగుణంగా డిజైన్ చేయబడిన అమరావతి ఎయిర్‌పోర్ట్, భవిష్యత్తులో ఏపీ గ్లోబల్ ఇమేజ్‌కి బలంగా మారవచ్చని అంటున్నారు.
Also Read: Water Bridge in AP: ఇదేం స్పాట్.. ఏపీలో ది బెస్ట్ అంటే ఇదేనట.. ఇక్కడన్నీ వింతలే!
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక సిద్ధం చేస్తోంది. ఇందులో భూమి వివరాలు, వాతావరణ పరిస్థితులు, అవసరమైన మౌలిక సదుపాయాలు, టెక్నికల్ ఫీజిబిలిటీ, ఎయిర్ ట్రాఫిక్ డిమాండ్ వంటి అంశాలు ఉండనున్నాయి. ఒకసారి కేంద్రం ప్రిన్సిపల్ అప్రూవల్ ఇస్తే.. తదుపరి దశల్లో పర్యావరణ అనుమతులు, ఆర్థిక పెట్టుబడులు, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ వంటి అంశాలు ముందుకు సాగుతాయి.
ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌కు అనుకూలంగా అమరావతి – గుంటూరు – విజయవాడ ట్రై సిటీ ప్రాంతం ఇప్పటికే అద్భుత రవాణా మౌలిక వసతులతో ఉంది. రైల్వే, రోడ్డు, నేషనల్ హైవే, ఇంటిగ్రేటెడ్ బస్సు నెట్‌వర్క్ ఇప్పటికే ఉన్నందున, ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ ఆయా ప్రాంతాల మధ్య ప్రయాణాలను మరింత వేగవంతం చేస్తుంది. అంతేకాక, ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన కార్గో హ్యాండ్లింగ్ కూడా బాగా పెరిగే అవకాశముంది.
ఇది కేవలం ఒక విమానాశ్రయం మాత్రమే కాదు.. రాష్ట్రానికి సంబంధించి భవిష్యత్తులో అంతర్జాతీయ పెట్టుబడులకు గేట్ వేలా మారే అవకాశముంది. అమరావతి పునర్నిర్మాణ ప్రక్రియలో ఇది ఒక ప్రధాన అడుగు అని చెప్పవచ్చు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, ఏపీకి గగనతల ద్వారా గ్లోబల్ కనెక్టివిటీకి నాంది పలికినట్టే అవుతుంది.