Mulugu Seed Bomb Victims: బిగ్‌టీవీ సీడ్ బాంబ్ కథనాలకు ఫలితం దక్కబోతుంది. బిగ్ టీవీ కథనాలకు స్పందించిన రైతు కమిషన్.. నష్టపోయిన రైతులకు ఇవాళ పరిహారం చెక్కులు అందించబోతుంది. ములుగు జిల్లాలో ముసుగు దందాలకు చెక్ పెట్టింది. గత ఆరేళ్లుగా జన్యు మార్పిడి విత్తనాల పేరుతో ఆదివాసీ రైతులను దగా చేస్తున్న కంపెనీల బాగోతాన్ని సీడ్ బాంబ్ పేరుతో బిగ్‌టీవీ కథనాలు ప్రసారం చేసింది. నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చేందుకు విత్తన కంపెనీలు ముందుకొచ్చాయి. ప్రభుత్వ ఆదేశాలతో రైతులకు ప్రయోజన జరగబోతోంది.
ఇవాళ ములుగు ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించనున్నారు మంత్రులు తుమ్మల, సీతక్క. ఏజెన్సీ మండలాలైన వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, మంగపేట రైతులకు పంట నష్టం చెక్కులను అందించనున్నారు. మొక్కజొన్న క్రాస్ బెడ్ విత్తన కంపెనీల ద్వారా రైతులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. సుమారు 950 మంది రైతులకు నాలుగు కోట్ల విలువైన చెక్కులను ఇవ్వనున్నారు.
ములుగు జిల్లాలో జీఎం మొక్కజొన్న క్రాప్ చుట్టూ పెద్ద కథే నడిచింది. రైతుల్ని బుట్టలో వేసుకుని జన్యుమార్పిడి విత్తనాలు నాటించడం, అవి కాస్తా దిగుబడులు రాకపోవడం, పెట్టుబడి ఖర్చులు నష్టపోవడం ఇవన్నీ జరిగాయి. దీనిపై బిగ్ టీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది. రైతులకు ఎలా నష్టం జరిగిందో కళ్లకు కట్టేలా వివరించింది.
ములుగు ఏజెన్సీలో విత్తన కంపెనీలు, ఆర్గనైజర్ల మోసాలపై వచ్చిన కథనాలకు కలెక్టర్ దివాకర్ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఏజెన్సీలోని ఆర్గనైజర్లు, విత్తన కంపెనీలు రైతులను ఏవిధంగా మోసం చేస్తున్నారనే దానిపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. క్రాస్ బెడ్ విత్తనాల ద్వారా నష్టపోయిన రైతులకు కలెక్టర్ నివేదిక ఆధారంగా ఇవాళ నష్ట పరిహార చెక్కులను పంపిణీ చేపట్టనున్నారు.
దీంతో ప్రభుత్వం ఈ విషయంలో ఎంటర్ అయింది. వ్యవసాయ కమిషన్ కూడా పర్యటించింది. ములుగు కలెక్టర్ దర్యాప్తు చేశారు. జన్యుమార్పిడి విత్తనాల వల్లే నష్టం వాటిల్లిందని అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఈ విత్తనాలు సరఫరా చేసిన కంపెనీలను కూడా గుర్తించారు. కంపెనీలే బాధ్యత వహించాలని ఆదేశించారు. చాలా చర్చలు జరిగాయి. చివరికి పరిహారం ఇచ్చేందుకు కంపెనీలు ఒప్పుకున్నాయి.
Also Read: సామాన్య కార్యకర్త నుంచి టీపీసీసీ.. ఆ తర్వాత సీఎం.. ఇది కదా రేవంత్ రెడ్డి అంటే..
ములుగు జిల్లాలో విత్తనాల కంపెనీల కారణంగా నష్టపోయిన మొక్కజొన్న రైతులకు న్యాయం చేశామని రైతు కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా విత్తన కంపెనీలతో మాట్లాడి దాదాపు రూ. మూడున్నర కోట్లు వారికి పరిహారం ఇప్పించామన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ములుగు జిల్లా రైతులు తమకు న్యాయం చేయాలని గతంలో ఎంతోమందికి గోడు చెప్పుకున్న ఫలితం లేకుండా పోయిందన్నారు. కానీ రైతుల సంక్షేమం కోరే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే రైతులకు న్యాయం జరిగిందన్నారు.