Water Bridge in AP: రోడ్డు మీద కార్లు.. వాటర్ బ్రిడ్జిపై నీటి ప్రవాహం.. అచ్చం సినిమాల్లోలానే ఉంటుంది ఈ ప్లేస్. కానీ ఇది హైదరాబాద్ కాదు, ఫారిన్ ప్లేస్‌యూ కాదు.. ఇది ఏపీలోనే. కింద మనం కారులో వెళ్తుంటే.. మన తలపై గుండా 12 అడుగుల లోతు నీరు పారుతుంటే ఎలా ఉంటుంది.. ఇదేదో విదేశాల్లో కాదు బాబోయ్.. మిస్ కావద్దు.. ఈ బెస్ట్ స్పాట్ మీకు చేరువలోనే.
ఏపీలోని గుంటూరు జిల్లా మాచర్లకి దగ్గర్లో ఉన్న ఓ అద్భుత నిర్మాణం గురించి చాలామందికి తెలియదు. అదే మాచర్ల వాటర్ బ్రిడ్జ్, లేకుండా చెప్పాలంటే రోడ్డు కింద ప్రవహించే నీటి వాగు. సాధారణంగా మనం వాగు, కాలువ రోడ్డుకు పక్కనే లేదా కిందగా ఉంటుందని భావిస్తాం. కానీ ఇక్కడ మాత్రం ఆ భూమికే తారుమారు. ఇక్కడ పైన ఉన్న నిర్మిత కాలువలో సుమారు 12 అడుగుల లోతు నీరు ప్రవహిస్తుంటే, దానికి కింద గుండా మనం వాహనాల్లో ప్రయాణిస్తాం. ఈ క్షణం చూస్తే ఎవరైనా ఆశ్చర్యంతో నోరు తెరుచుకుంటారు.
ఈ వింత నిర్మాణం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రైట్ కెనాల్ (Right Canal) లో భాగంగా ఉంది. ఈ కాలువ సాగునీటి కోసం వేసిన అత్యంత కీలక మార్గం. కానీ మాచర్ల – జమ్మలమడుగు రోడ్డులో ఓ చోట, దీన్ని ఎత్తుగా కాంక్రీట్ బాక్స్ తరహాలో నిర్మించి, దాని కింద గుండా రోడ్డును వేశారు. అంటే నీరు పైన తూగుతూ పోతుంటే, మనం కింద రోడ్డుపై ప్రయాణిస్తూ వెళ్తాం. మనకు తెలియకుండానే మన తలపై ఏకంగా 12 అడుగుల లోతులో నీటి ప్రవాహం నడుస్తోందన్న మాట.
Also Read: Telangana Hidden Temples: ఇదెక్కడ అమ్మో! అడవిలోనే అద్భుత శక్తి స్థలం.. మీరు దర్శించారా?
ఈ స్పాట్ మాచర్ల పట్టణానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గుంటూరు నుండి 137 కిమీ దూరంలో ఉన్న ఈ ప్రదేశానికి రోడ్ ద్వారా సులభంగా వెళ్లవచ్చు. పైగా ఇది ఎతిపోతల జలపాతాలకు చాలా దగ్గరగా.. కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంటే మీరు రెండు అద్భుత ప్రదేశాలను ఒకేసారి చూడొచ్చు. ఒకవైపు ప్రకృతి వనం, మరోవైపు మానవ నిర్మిత అద్భుతం.
ఈ వాటర్ బ్రిడ్జ్‌కి స్పెషల్ టైమ్ ఏదైనా ఉందంటే.. అది సాయంత్రం సూర్యాస్తమయం. ఆ సమయంలో పై నుంచి నీటికి పడే కాంతితో అది బంగారు నీటిలా మెరిసిపోతుంది. ఇక మీరు కింద రోడ్డులో ప్రయాణిస్తూ ఇక్కడి అద్భుతాన్ని చూడవచ్చు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియా రీల్స్ కు హాట్ స్పాట్‌గా మారింది.
ఇలా రోడ్డుకు పైన నీటి వాగు ఉండే నిర్మాణాలు మనదేశంలో చాలా అరుదు. ఇది కేవలం సాగునీటి అవసరాల కోసమే కాకుండా, ఇంజనీరింగ్ అద్భుతంగా గుర్తింపు పొందుతోంది. ఇప్పుడు పర్యాటకులచే ఇది ఓ హిడెన్ టూరిజం స్పాట్ గా మారుతోంది. ఎలాంటి టికెట్ అవసరం లేదు. ఎప్పుడైనా వెళ్లొచ్చు. కానీ ఫొటోలు, వీడియోలు తీసేందుకు సాయంత్రం టైమ్ బెస్ట్.
మొత్తానికి చెప్పాలంటే.. మాచర్ల వాటర్ బ్రిడ్జ్ అనేది మన గుండెల్లో నిలిచిపోయేలా ఉండే ఒక అద్భుత అనుభవం. ఓసారి అక్కడికి వెళ్లి పైకి తలెత్తి చూస్తే.. మన తలపై 12 అడుగుల లోతైన నీటి ప్రవాహం ఎలా ఉండబోతుందో మీరే ఊహించుకోండి. ఇది కేవలం చూడటానికి మాత్రమే కాదు, ఫీల్ అవ్వడానికి, మర్చిపోలేని ట్రిప్ కోసం పర్ఫెక్ట్ ప్లేస్!