BigTV English

AP Politics : పోలీసులపై రాంబాబు రుబాబు..!

AP Politics : పోలీసులపై రాంబాబు రుబాబు..!

AP Politics : అసలే టైమ్ బాలేదు. పవర్ కూడా లేదు. రెడ్ బుక్ వేట కొనసాగుతోంది. సహచరులంతా వరుసగా అరెస్ట్ అవుతున్నారు. జైలుకు వెళుతున్నారు. అధినేత జగన్ బెంగళూరులో దాక్కున్నారు. ఇలాంటి సమయంలో గిల్లితే గిల్లించుకోవాలి కానీ అరవకూడదు. ఇంత చిన్న లాజిక్ మిస్ అయినట్టున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. గుంటూరులో పోలీసులపై రెచ్చిపోయారు. అరుస్తూ, తిడుతూ, వేలు చూపిస్తూ.. నానారచ్చ చేశారు. పోలీసులు సైతం ఎక్కడా తగ్గలేదు. నువ్వెంత అంటే.. నువ్వెంత అనే రేంజ్‌లో నడిరోడ్డుపై గొడవ జరిగింది. వైసీపీ నేత పరువంతా పోయింది. మరో కేసుకు రంగం సిద్ధమైంది.


రెచ్చిపోయిన రాంబాబు..

వెన్నుపోటు దినోత్సవం సందర్భంగా వైసీపీ నేత అంబటి రాంబాబు నిరసన కార్యక్రమం చేపట్టారు. తన ఇంటి నుంచి గుంటూరు కలెక్టర్ ఆఫీసుకు ర్యాలీగా బయలు దేరారు. అయితే, పర్మిషన్ లేదంటూ పోలీసులు ఆయన్ని అడ్డుకున్నారు. అంతే. రాంబాబు రెచ్చిపోయారు. నా ర్యాలీనే ఆపే దమ్ముందా అంటూ పోలీసులపై బెదిరింపులకు దిగారు అంబటి రాంబాబు. నీ అంతు చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీస్ ఆఫీసర్ నరహరి సైతం అదే రేంజ్‌లో రివర్స్ అయ్యారు. ర్యాలీకి అనుమతి లేదని.. ముందుకు వెళ్లడం కుదరదని తేల్చిచెప్పారు. మాటలు జాగ్రత్తగా మాట్లాడాలంటూ హెచ్చరించారు. పోలీస్ అధికారి ఎదురుచెప్పడంతో అంబటి మరింత ఫ్రస్టేషన్‌కు లోనయ్యారు. మర్యాదగా మాట్లాడు.. వేలు చూపిస్తావేం.. అంటూ పెద్ద పెద్దగా అరిచారు. నడిరోడ్డుపై అంబటి వర్సెస్ ఆఫీసర్ డైలాగ్ వార్ దడదడలాడిపోయింది.


పెద్దారెడ్డి సైతం..

ఏపీ వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం బలప్రదర్శనకు వేదికగా మారింది. తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. యాడికి మండల కేంద్రంలో వెన్నుపోటు దినోత్సవానికి ప్లాన్ చేసుకున్నారు పెద్దారెడ్డి. ఈ కార్యక్రమంలో హాజరయ్యేందుకు వెళ్తుండగా మధ్యలోనే అడ్డుకున్నారు. దాంతో పోలీసులతో గొడవకు దిగారు. తనకు తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు కూడా అనుమతి ఇచ్చిందని, ఎలా అడ్డుకుంటారంటూ నిలదీశారు. పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది.

బొత్స బేజార్..

మరోవైపు, చీపురుపల్లిలో ర్యాలీ చేస్తుండగా ఎండ వేడికి తాళలేక మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సొమ్మసిల్లి పడిపోయారు. నిత్యం ఏసీలో బతికే జీవితం కదా. ఒక్కసారిగా ఇలా రోడ్డు మీదకు రావడంతో ఆయన శరీరం తట్టుకోలేకపోయింది. వాహనంపై మాట్లాడుతుండగా.. సడెన్‌గా కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా.. కాసేపటికి కోలుకున్నారు. వైసీపీ అధినేత జగన్‌ ఫోన్‌ చేసి బొత్సాను పరామర్శించారు.

జగన్ మిస్సింగ్..

ఇదంతా సరే. ఇంతకీ జగన్ ఎక్కడ? వెన్నుపోటు దినోత్సవంలో వైసీపీ అధినేత మిస్సింగ్. ఇలాంటి కీలక సమయంలో జగన్ ఏపీలో లేరు. బెంగళూరులోనే ఉన్నారు. కేడర్‌ను ముందుకు తోసి.. వారికి వెన్నుపోటు పొడిచి.. జగన్ పారిపోయారంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.

Also Read : బెంగళూరులో జగన్ ఏం చేస్తున్నారంటే..

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×