BigTV English
Advertisement

Samantha: సొంత అభిమానులనే మోసం చేస్తున్న సమంత.. ఛీ ఛీ డబ్బుల కోసం ఇంత నీచమా ?

Samantha: సొంత అభిమానులనే మోసం చేస్తున్న సమంత.. ఛీ ఛీ డబ్బుల కోసం ఇంత నీచమా ?

Samantha: ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో యాక్టివ్ అవుతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే బాలీవుడ్ లో రాజ్ నిడిమోరు (Raj Nidimoru) దర్శకత్వంలో ‘రక్త బ్రహ్మాండ్’ వెబ్ సిరీస్ లో నటిస్తున్న ఈమె.. ఇటు నిర్మాతగా కూడా మొదటి అడుగు వేసింది. ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ బ్యానర్ ను ఏర్పాటు చేసి, ‘శుభం’ అనే సినిమాలో విడుదల చేశారు. మే 9వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని, నిర్మాతగా మొదటి సక్సెస్ ను అందించింది. ఇకపోతే ఇప్పుడు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తోంది సమంత. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ కూడా విడుదల చేస్తానని తెలిపింది. ఇలాంటి సమయంలో సమంతకు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో అభిమానుల ఆగ్రహానికి గురి అవుతోందని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. సమంత ఇటీవల పెట్టిన ఒక పోస్ట్ పైనే ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పుడు సమాచారం అందిస్తోంది అంటూ ఒక డాక్టర్ సంచలన పోస్ట్ పెట్టడంతో అది కాస్త హాట్ టాపిక్ గా మారింది. మరి అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.


సమంత పై డాక్టర్ ఊహించని కామెంట్స్..

ప్రస్తుతం సమంత ‘నికోటినమైడ్ మోనోన్యూక్లియోటైడ్'(NMN ) సప్లిమెంట్లను ప్రమోట్ చేయడంతోనే ఇప్పుడు విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమె చెప్పేవి అన్నీ అబద్ధాలే అని ప్రముఖ డాక్టర్ సిరియాక్ అబ్బీ ఫిలిప్స్ ఇంస్టాగ్రామ్ ద్వారా ఒక సంచలన పోస్టు పెట్టారు. ఈ ప్రోడక్ట్ వాడితే శక్తి పెరుగుతుందని, ఏకాగ్రత పెరుగుతుందని సమంత తెలిపింది. దీంతో ఆయన స్పందిస్తూ..” సమంత సైన్స్ తెలియని నటి. ఆ కంపెనీ ఒక మోసపూరితమైనది. నాడ్ అనేది జీవక్రియకు ఒక ముఖ్యమైన కో ఎంజైమ్ . అయితే NMN అనేది నాడ్ స్థాయిలను పెంచుతుందని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రచారంలో ఉన్న ఒక సప్లిమెంట్. చాలామంది.. దీనిని వాడితే వృద్ధాప్యాన్ని తగ్గించే అద్భుతమైన ఔషధం అంటూ మార్కెట్ చేస్తున్నారు. దీనికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఏవి లేవు. దీనివల్ల శరీరం శోషణకు గురవుతుందే తప్ప అవయవాలకు చేరుతుందని ఎటువంటి ఆధారాలు లేవు” అని ఆయన తెలిపారు.


ALSO READ:VD -14: హద్దులు దాటేస్తున్న బడ్జెట్.. విజయ్ దేవరకొండ రాబట్టేనా..?

నిజాలు తెలిసి సమంత పై దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్స్..

అంతేకాకుండా ఇందుకు సంబంధించిన పలు విస్తుపోయే నిజాలు కూడా ఆయన బయటపెట్టి , కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ను సమంత మోసం చేస్తోంది అంటూ తెలిపారు. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ కూడా ఫ్రాడ్ సప్లిమెంట్లను ప్రచారం చేస్తున్నందుకు ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఛీ ఛీ మిమ్మల్ని నమ్ముకున్న ఎంతోమంది అభిమానులకు మీరు ఇచ్చే బహుమతి ఇదా.. మీరు డబ్బు కోసం కక్కుర్తి పడి మోసం చేస్తారా? అంటూ సమంత పై విమర్శలు గుప్పిస్తున్నారు. మరి సమంత వరకు ఈ విషయం చేరితే దీనిపై ఆమె వివరణ ఇస్తుందా? తన అభిమానులలో ఏర్పడిన అనుమానాలకు క్లారిటీ ఇస్తుందా అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×