Former Minister Ambati Rambabu Comments on Balineni: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజీనామాపై వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు స్పందించారు. బాలినేని శ్రీనివాస రెడ్డి పార్టీని వీడినంత మాత్రనా పార్టీకి కలిగే నష్టమేమీ లేదన్నారు. అటువంటివారు వెళ్లిపోతేనే పార్టీ బాగుపడుతుందన్నారు. పార్టీ ఆఫీసులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బాలినేని రాజీనామాపై పలు వ్యాఖ్యలు చేశారు. ‘ఈ సమయంలో పార్టీకి, అధ్యక్షుడికి అండగా ఉండాల్సిందిపోయి.. బాలినేని శ్రీనివాస్ రెడ్డి పార్టీని వీడడం సరికాదు. అధికారం లేనప్పుడు కొందరు పార్టీని వీడుతుంటారు. అలాంటివారు పార్టీని వీడితే నష్టమేమీ జరగదు. ఇంకా పార్టీకే మేలు జరుగుతుంది. జగన్ పద్ధతి సరిగా లేదంటూ బాలినేని పేర్కొనడం సరికాదు. అధికారంలో ఉన్నప్పుడు బాలినేనికి జగన్ మోహన్ రెడ్డి నచ్చారు. ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి జగన్ నచ్చడంలేదా?’ అంటూ అంబటి ప్రశ్నించారు.
Also Read: రాష్ట్రంలో స్టూడియోలు నిర్మించండి.. నిర్మాతలకు మంత్రి మరోసారి ఆహ్వానం
అనంతరం చంద్రబాబుపై ఆయన పలు విమర్శలు గుప్పించారు. చంద్రబాబు వచ్చారు.. స్కామ్స్, వరదలు వచ్చాయి అంటూ అంబటి ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం మంచి ప్రభుత్వమంటూ చంద్రబాబు పదే పదే ప్రచారం చేసుకుంటున్నారని.. అయినా ఇది ఏ విధంగా మంచి ప్రభుత్వమవుతుందంటూ అంబటి సూటిగా ప్రశ్నించారు.
హామీల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలను దోచుకుంటుందన్నారు. ఇందుకోసం మంచి ప్రభుత్వం అనాలా? అంటూ ఆయన ప్రశ్నించారు. వరదలు వచ్చినప్పుడు ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని, దీంతో అనేకమంది ప్రాణాలను కోల్పోయారన్నారు. ఇందుకోసం మంచి ప్రభుత్వం అనాలా అంటూ అంబటి ప్రశ్నించారు. ఇటు నూతన మద్యం పాలసీతో కూడా ప్రభుత్వం దోచుకోబోతుందన్నారు. ఇందుకోసం ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అనాలా? అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
Also Read: తిరుమల లడ్డూపై వివాదం.. వేంకటేశ్వరుడికి మచ్చతెచ్చేలా మాజీ సీఎం చేశారా?
ఇటు ఇసుక పేరుతోనూ టీడీపీ ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా రాష్ట్రంలో దోచుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఇసుక దోపిడీకి శ్రీకారం చుట్టి ఇసుక ఫ్రీ అంటూ ప్రచారం చేసుకుంటున్నదంటూ కూటమి ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నాణ్యమైన మద్యం అంటూ ఏపీ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నదని.. అయినా నాణ్యమైన మద్యం అంటే ఏంటి? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా? అంటూ అంబటి విమర్శల వర్షం కురిపించారు. ఆ మద్యం బాటిళ్లపై మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అనే పదం తీసేయండి.. నారా వారి సారా పాలన డౌన్ డౌన్ అనే పరిస్థితి వస్తది’ అంటూ అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.