Bigg Boss Sonia : బుల్లి తెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజనలతో పోలిస్తే ఈసారి సీజన్ ను మేకర్స్ కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. కొత్త వ్యక్తులతో పాటుగా టాస్క్ లను కూడా డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు. ఇందులో ఉండే ప్రతి కంటెస్టెంట్ కు ఏదోక బ్యాగ్రౌండ్ ఉండటం మాత్రమే కాదు. జనాలు నమ్మలేనంత స్టోరీ కూడా ఉంటుంది. బయట వారి జీవితం ఎలా ఉన్నా కూడా హౌస్ లో మాత్రం లవ్ ట్రాక్ లతో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు. ఇప్పటికే హౌస్ లో సోనియా ముగ్గురితో లవ్ ట్రాక్ నడిపిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే తాజాగా ఆమె లవర్ గురించి ఓ షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
నిఖిల్, పృథ్వీతో సోనియా ఉండే తీరు డౌట్ పడేలా చేస్తుంది. సిగరేట్ తాగితే ఏదైనా ఇస్తానంటూ నిఖిల్‌తో సోనియా చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే, సోనియాపై ఉన్న నెగెటివిటీని దూరం చేయడగానికో, తన ఇదివరకే రిలేషన్‌లో ఉందని చెప్పడానికో మరి యశ్విర్ అని ఉంది అంటూ నాగ్ దాని గురించి బయట పెట్టే ప్రయత్నం చేశాడు. నాగార్జున మాటలతో నిఖిల్ ఒక్కసారిగా ఖంగుతిన్నాడు. ఆ తర్వాత కూడా ఈ ముగ్గురు క్లోజ్‌గానే ఉంటున్నారు. అయితే, తాజాగా ప్రసారం అయిన ఎపిసోడ్ లో ప్రేరణతో సోనియా తన లవ్ విషయాన్ని బయట పెట్టింది. ప్రేరణతో ఒంటరిగా మాట్లాడుతు లవ్ స్టోరీ చెప్పేసింది. నేను ఎప్పుడు ప్రపోజ్ చేయలేదు కానీ, రేండున్నర ఏళ్లుగా మేము కలిసి పని చేస్తున్నాం అని సోనియా చెప్పింది..
ఎన్‌జీవోకి వెబ్ సైట్ డిజైనింగ్ ఆయనే చేశారు. దానికి యూఎస్ నుంచి స్పాన్సర్ కూడా అని సోనియా తెలిపింది. అవునా మరి పెళ్లి చేసుకోవచ్చు కదా అని ప్రేరణ అడిగింది. కొన్ని బంధాలు ముందే రాసి ఉంటాయాని ఏదో చెప్పుకొచ్చింది. అతను నా నిర్ణయం కోసం వెయిటింగ్ అంతే అని చెప్పిన సోనియా.. ప్రేరణ చెవి దగ్గరికి వెళ్లి మెల్లిగా.. ఆయనకు డివోర్స్ అయింది అని చెప్పింది. హో నిజమా.. నువ్వు అర్థం చేసుకున్న తీరు అందరికీ నచ్చింది అంటూ ప్రేరణ సోనియాకు కాంప్లిమెంట్ ఇచ్చింది. తన లవర్ అమెరికాలో ఉంటాడని, డివోర్సీ అని సోనియా బయటపెట్టింది. ఇక మూడో వారం నామినేషన్స్ కాస్త ఆసక్తికరంగా ఉన్నాయి.. ఈ వారం బిగ్ బాస్ తెలుగు 8 థర్డ్ వీక్ నామినేట్ అయిన వాళ్లలో ప్రేరణ కంబం, నాగ మణికంఠ, పృథ్వీరాజ్, కిర్రాక్ సీత, విష్ణుప్రియ, అభయ్ నవీన్, యష్మీ గౌడ, నైనిక ఉన్నారు. వీరిలో అభయ్ నవీన్, పృథ్వీరాజ్ అతి తక్కువ ఓట్లతో డేంజర్ జోన్‌లో ఉన్నారు.. మరి ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.. ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి..