Jani Master Case Updates: ఒక మహిళా కొరియోగ్రాఫర్‌ను లైంగికంగా వేధిస్తున్నాడనే కారణంతో సైబరాబాద్‌లో రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ప్రముఖ డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌తో కేసు నమోదలయ్యింది. అయితే కేసు నమోదు అయినప్పటి నుండి జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన హైదరాబాద్‌లో లేరని తెలిసింది. దీంతో ఇతర రాష్ట్రాల పోలీసులు కూడా జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకునే విషయంలో హైదరాబాద్ పోలీసులకు సాయంగా నిలిచారు. ప్రస్తుతం జానీ మాస్టర్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ విషయంపై డీసీపీ ఒక ప్రెస్ నోట్‌ను విడుదల చేశారు.
నాలుగేళ్ల క్రితం
సైబరాబాద్ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం.. సెప్టెంబర్ 15న ఐపీసీ సెక్షన్ 276 (2)(ఎన్), 506, 323 ప్రకారం జానీ మాస్టర్‌పై కేసు నమోదయ్యింది. 2020లో ఒక షూటింగ్ విషయంగా ముంబాయ్‌కు వెళ్లినప్పుడు తనపై మొదటిసారి అత్యాచారానికి పాల్పడ్డాడని జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీపై లైంగిక ఆరోపణలు చేసింది బాధితురాలు. ఆ తర్వాత కూడా తనను పలుమార్లు లైంగికంగా వేధించడాని తెలిపింది. ఈ విషయం ఎవరికీ చెప్పకూడదని బెదిరించడాని బయటపెట్టింది. ఇక బాధితురాలు తెలిపినదాని ప్రకారం మొదటిసారి తను లైంగిక వేధింపులకు గురయినప్పుడు తను ఇంకా మైనరే.
Also Read: ఈ ఆరోపణలు వింటుంటే బాధగా ఉంది.. జానీ మాస్టర్ కేసుపై మంచు మనోజ్ స్పందన
గోవాలో దొరికాడు
ఒక మైనర్‌ను లైంగిక వేధించాడనే ఆరోపణపై పోక్సో చట్టంలోని సెక్షన్ 5(ఐ) r/w6 కింద కూడా కేసు నమోదయ్యింది. సెప్టెంబర్ 15న జానీ మాస్టర్‌పై కేసు నమోదు కాగా అప్పటినుండి తన కోసం పోలీసుల గాలింపు మొదలయ్యింది. మొత్తానికి సెప్టెంబర్ 19న గోవాలో పోలీసులకు చిక్కాడు జానీ మాస్టర్. అక్కడే లోకల్ కోర్టుకు ఆయనను తరలించి ట్రాన్సింట్ వారెంట్ తీసుకున్నారు పోలీసులు. అనంతరం తనను హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. త్వరలోనే హైదరాబాద్‌లోని రెగ్యులర్ కోర్టులో జానీ మాస్టర్‌ను హాజరుపరుస్తామని ఈ ప్రెస్ నోట్‌లో వివరించారు పోలీసులు. దీంతో మొత్తానికి ఒక మహిళా కొరియోగ్రాఫర్‌కు అన్యాయం చేశాడనే ఆరోపణలతో జానీ మాస్టర్ జైలుకు వెళ్లక తప్పదని ప్రజలు అనుకుంటున్నారు.
ముంబాయ్‌లో మొదలు
జానీ మాస్టర్‌కు మాత్రం ఈ విషయంపై స్పందించే అవకాశం రాలేదు. బాధితురాలు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం.. జానీ మాస్టర్ తనకు పరిచయమయిన రెండేళ్లకే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా అవకాశాలు ఇచ్చాడు. ఆ తర్వాత తనతో పాటు ఔట్‌డోర్ షూటింగ్స్‌కు తీసుకెళ్లేవాడు. అలా ఒకసారి ముంబాయ్‌కు షూటింగ్‌కు వెళ్లినప్పుడు అక్కడ హోటల్ రూమ్‌లో మొదటిసారి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తిరిగి వచ్చిన తర్వాత కూడా తనను పలుమార్లు అత్యాచారం చేశాడు. గత కొన్నేళ్లుగా ఈ విషయాన్ని బాధితురాలు ఎవరికీ చెప్పకుండా దాచిపెట్టింది. ఎవరికైనా చెప్తే ఇండస్ట్రీలో ఉండకుండా చేస్తానని జానీ మాస్టర్ అన్నాడని ఆరోపిస్తోంది బాధితురాలు. ఇన్నాళ్లు ఇదంతా తాను ఎలా భరించిందో అంటూ పలువురు సెలబ్రిటీలు తనను సపోర్ట్ చేయడానికి ముందుకొస్తున్నారు.