E-Paper
Advertisement

Ambati Rambabu: జైలు నుంచి విడుదలవుతున్న తరుణంలో మరో కేసు.. “తగ్గేదేలే” అంటున్న‌ అంబటి రాంబాబు

Ambati Rambabu: జైలు నుంచి విడుదలవుతున్న తరుణంలో మరో కేసు.. “తగ్గేదేలే” అంటున్న‌ అంబటి రాంబాబు
Advertisement

Ambati Rambabu: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలవుతున్న తరుణంలో మరోసారి వార్తల్లో నిలిచారు. సత్తెనపల్లిలో సంక్రాంతి లక్కీ డ్రా వసూళ్ల కేసులో పీటీ (Prisoner Transit) వారెంట్ జారీ కావడంతో, పోలీసులు ఆయనను గుంటూరు కోర్టుకు తీసుకువచ్చారు. ఇప్పటికే పలు కేసుల్లో బెయిల్ పొందిన అంబటి, కొత్తగా నమోదైన ఈ కేసు విచారణ నిమిత్తం న్యాయస్థానం ముందు హాజరయ్యారు.

గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది.  ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రిమాండ్ ఉత్తర్వులు జారీ చేయడంతో, పోలీసులు అంబటి రాంబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు త‌ర‌లించారు.

Advertisement

అంత‌కుముందు కోర్టుకు తరలిస్తున్న సమయంలో అంబటి రాంబాబు తనదైన శైలిలో స్పందించారు. పోలీసు బస్సులో ఉండగానే కిటికీలో నుంచి బయటకు చూస్తూ, ‘పుష్ప’ సినిమా స్టైల్‌లో గడ్డం కింద చేయి పెట్టి “తగ్గేదేలే” అంటూ సైగలు చేశారు. రాజకీయంగా తనపై ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన ఈ సంజ్ఞ ద్వారా తన అనుచరులకు మరియు మీడియాకు సంకేతాలిచ్చారు.

ప్రస్తుతం అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా మెడికల్ కాలేజీల పిపిపి విధానంపై ఆందోళనలు, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులు విచారణలో ఉన్నాయి. ఈ కేసుల్లో ఇప్పటికే బెయిల్ మంజూరు కాగా, తాజా లక్కీ డ్రా కేసులో న్యాయస్థానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందోనని వైసీపీ శ్రేణులు ఆసక్తిగా గమనిస్తున్నాయి. పోలీసుల కస్టడీ పిటిషన్లను కోర్టు తిరస్కరించడం ఆయనకు ఊరట కలిగించే అంశం.

Advertisement

అంబటి రాంబాబుపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంబటిపై దాడి జరిగిన అనంతరం కొత్తగా 36 కేసులను నమోదు చేయగా, ఆ కేసులన్నింటిలో సెక్షన్ 41 కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే, ఈ ఉత్తర్వులను కాదని ప్రభుత్వం ఆయనపై మరో పాత కేసును తెరపైకి తీసుకువచ్చి వేధింపులకు గురిచేస్తోందని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ అవినీతి, అక్రమాలు మరియు ప్రజా సమస్యలపై గళం వినిపిస్తున్నందుకే అంబటి రాంబాబును లక్ష్యంగా చేసుకున్నారని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.

Read Also: AP Legislative Council: బొత్స vs పార్థసారధి.. మండలిలో వాడీ వేడీ చర్చ.. నేతల మధ్య తీవ్ర వాగ్వాదం

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×