BigTV English

Ambati Rayudu : రాయుడి పొలిటికల్ ఇన్నింగ్స్.. నెట్ ప్రాక్టీస్ షురూ..

Ambati Rayudu : రాయుడి పొలిటికల్ ఇన్నింగ్స్.. నెట్ ప్రాక్టీస్ షురూ..


Ambati Rayudu latest news(Andhra pradesh political news today) : ప్రజాసేవ చేస్తా. బట్ అది ఏ ప్లాట్ ఫామో ఇప్పుడే చెప్పలేను. ఇది.. మాజీ క్రికెటర్ అంబటి రాయుడి లేటెస్ట్ డేలాగ్స్. ఆ మధ్య సీఎం జగన్ ను కలిసిన అంబటి రాయుడు.. ప్రస్తుతం గుంటూరు జిల్లాల్లోని గ్రామాల్లో పర్యటిస్తున్నాడు. అక్కడి ప్రజలతో మమేకం అవుతున్నాడు. వారి సమస్యలను తెలుసుకుంటున్నాడు. మరి అంబటి రాయుడు పొలిటికల్ గా ఎంటర్ అవడం ఖాయమేనట్టేనా..? సెకండ్ ఇన్నింగ్స్ కోసం పక్కా స్కెచ్ వేసుకుంటున్నాడా..?

ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ముందు రిటైర్మెంట్ ప్రకటించాడు.. అంబటి రాయుడు. అయితే అప్పటి వరకు ఎలాంటి అంచనాలు లేవు కానీ.. ఆ తర్వాత వెంటనే పొలిటికల్ గ్రౌండ్ లోకి దిగేశాడు. ఐపీఎల్ కప్ తో డైరెక్ట్ గా సీఎం జగన్ తో సమావేశం నిర్వహించాడు. రెండు దఫాలుగా చర్చలు జరిపాడు. ఈ కలయిక.. అప్పట్లో పెద్ద సెన్షేషనే క్రియేట్ చేసింది. అంబటి రాజకీయాల్లోకి వస్తున్నాడంటూ రకరకాల ప్రచారాలు జరిగాయి. దానికి తగ్గట్లు అంబటి రాయుడు మాత్రం ఎలాంటి పొలిటికల్ స్టేట్ మెంట్ ఇవ్వలేదు.


సీన్ కట్ చేస్తే.. ప్రస్తుతం తన సొంత జిల్లా అయిన గుంటూరు జిల్లాలోని పలు గ్రామాల్లో అంబటి రాయుడు పర్యటిస్తున్నాడు. ముఖ్యంగా యువతతో మమేకం అవుతున్న అంబటి.. వారితో సెల్పీలు, అక్కడి పెద్దలతో ఫోటోలు దిగుతున్నాడు. కొన్ని స్కూళ్లకు వెళ్లి.. అక్కడి విద్యార్థులతో ముచ్చటించాడు. దీంతో అంబటి పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేసినట్టే అని తెలుస్తోంది. అయితే ఇదే విషయమై.. అంబటి స్పందిస్తూ ప్రజాసేవ చేయాలన్న ఆలోచన ఉందని స్పష్టం చేశాడు. కానీ అది ఏ ప్లాట్ ఫామో త్వరలోనే చెబుతానన్నాడు. ప్రస్తుతం ప్రజా సమస్యలు, రైతు సమస్యలు తెలుసుకుంటున్నానని.. త్వరలోనే అన్ని విషయాలు చెబుతానని స్పష్టం చేశాడు.

ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికిన అంబటి.. త్వరలో అమెరికాలో జరగబోయే మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ లో పాల్గొననున్నారు. ఆ తర్వాత పొలిటికల్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారనే ప్రచారం ఉంది. వైసీపీ టిక్కెట్ పై గుంటూరు ఎంపీగా అంబటి రాయుడు పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనికోసం కసరత్తు ప్రారంభించారని.. త్వరలోనే ఫ్యాన్ పార్టీలో చేరి.. పొలిటికల్ జర్నీని స్పీడప్ చేస్తారని చెబుతున్నారు.

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×