BigTV English

Srikakulam : తొడగొట్టి మీడియాకు వార్నింగ్.. RMO అరాచకం పీక్స్..

Srikakulam : తొడగొట్టి మీడియాకు వార్నింగ్.. RMO అరాచకం పీక్స్..


Srikakulam Rims : శ్రీకాకుళం రిమ్స్‌ RMO శంకర్‌రావు.. తానొక వైద్యాధికారినని మరిచి రెచ్చిపోయారు. మీడియా పట్ల దురుషుగా ప్రవర్తించి వీరంగం సృష్టించారు. తొడకొడుతూ ఏం చేసుకుంటారో చేసుకోండంటూ పేట్రేగిపోయారు. చివరకు మహిళా పారిశుద్ధ్య కార్మికులు సైతం RMO తీరుపై దుమ్మేత్తిపోస్తున్నారు. తమతోనూ అసభ్యకర మాటలు, చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు. ఇలాంటి వ్యక్తి ఆస్పత్రిలో ఉంటే పనిచేయలేమంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఎచ్చెర్ల మండలం కుప్పిలిలో ఓ తండ్రి కన్న కొడుకునే అతి కిరాతకంగా నరికి చంపేశాడు. మిగతా కుటుంబ సభ్యులనూ చంపేందుకు యత్నించగా.. వారంతా కేకలు వేయడంతో తండ్రి పారిపోయాడు. తీవ్రంగా గాయపడిన పెద్దకుమారుడు తాతారావు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ హత్యకు భార్యపై అనుమానమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. అర్ధరాత్రి జరిగిన ఘటన.. స్థానికంగా కలకలం రేపింది.


సమాచారం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. అయితే ఈ ఘటనను చిత్రీకరించేందుకు ఆస్పత్రికి వెళ్లిన మీడియాపై ఆర్‌ఎంవో.. అధికార మదంతో రెచ్చిపోయారు. అనుమతి లేదంటూ గేటు వద్దే మీడియాను పోలీసులతో అడ్డగించి నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఏం చేసుకుంటారో చేసుకొండంటూ తొడకొడుతూ మీడియా ప్రతినిధులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. అంతేకాకుండా శ్రీకాకుళం జిల్లా వాసులు వెనుకబడినవారంటూ దూషించారు. తనను ఎవరూ ఏం చేయలేరంటూ విర్రవీగారు. RMO ప్రవర్తనపై మీడియా ప్రతినిధులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

అటు RMOపై రిమ్స్‌ ఆస్పత్రి మహిళా పారిశుద్ధ్య కార్మికులు కూడా మండిపడుతున్నారు. మహిళా కార్మికులతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. కొంతమంది వైద్యులు తమకు సపోర్ట్‌ చేస్తే.. వారిని చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. పనిచేసే ఆడవాళ్లతో బూతులు మాట్లాడుతున్నారని తెలిపారు. RMO ప్రవర్తనపై ఎంతమంది అధికారులకు ఫిర్యాదు చేసినా కనీసం పట్టించుకోలేదని వాపోయారు. ఇక్కడ పనిచేయాలంటేనే భయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే RMO సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×