BigTV English

Pawan Varahi Yatra : విరామంలోనూ విశ్రాంతి లేదు.. వారాహి ఫీడ్‌బ్యాక్‌పై పవన్ కసరత్తు..

Pawan Varahi Yatra : విరామంలోనూ విశ్రాంతి లేదు.. వారాహి ఫీడ్‌బ్యాక్‌పై పవన్ కసరత్తు..


Pawn Varahi yatra

Pawan Kalyan Varahi Yatra details(AP latest news): ఎదురే లేకుండా దూసుకెళ్తున్న వారాహీ విజయయాత్రకు స్మాల్ బ్రేక్ పడింది. భీమవరం సభతో ముగియాల్సి ఉన్న తొలివిడత యాత్ర.. మరో రెండు రోజులు వాయిదా పడింది. పవన్ కు జ్వరం రావడంతో భీమవరం చేరుకున్న పవన్.. అక్కడే విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఓ వైపు వారాహీ నవరాత్రుల్లో ఉపవాసం ఉన్న పవన్.. అదే సమయంలో తొలివిడత వారాహీ యాత్రలో విరామం లేకుండా పాల్గొనడంతో.. పవన్ తీవ్రంగా నీరసించిపోయారు. దీంతో తొలుత స్వల్ప అస్వస్థతకు గురైన పవన్.. ఆ తర్వాత తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు.


ఇప్పటికే తూర్పుగోదావరిని చుట్టేసిన పవన్.. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలివిడత చివరి అంకానికి చేరుకున్న యాత్రను గ్రాండ్ గా ముగించాలనుకున్న సమయంలో.. పవన్ జ్వరం బారిన పడ్డారు. ప్రస్తుతం పవన్ ను విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. భీమవరంలోని నిర్మలాదేవి ఫంక్షన్‌ హాల్‌లోనే పవన్ రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో భీమవరం సభను ఈ నెల 30 కి వాయిదా వేశారు. ఆరోజు ఉదయం 11 గంటలకు నిర్వహించాలని నిర్ణయించారు. ఏకంగా 10 లక్షల మందితో సభ నిర్వహణకు.. జనసేన నాయకత్వం గట్టిగా కృషి చేస్తోంది.

ఎప్పుడైతే వారాహీయాత్ర ప్రారంభమైందో అప్పటి నుంచి ఏపీ పాలిటిక్స్ పూర్తిగా టర్న్ తీసుకున్నాయి. పవన్ సెంట్రిక్ గానే రాజకీయాలు నడిచాయి. పవన్ ప్రతీ స్టేట్ మెంట్ పై అధికార పార్టీ ఎదురుదాడికి దిగింది. ఈ నేపథ్యంలో తొలివిడత యాత్రపై పవన్ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో పట్టు ఉందని విశ్వసిస్తున్న పవన్.. బలాలు, బలహీనతలను బేరీజు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండో విడత యాత్రపై అప్పుడే కసరత్తు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. భీమవరం సభ తర్వాత రెండో విడత యాత్రపై క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పార్టీ ఇంచార్జులతో సమావేశం అవుతున్నారు.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×