Online App Fraud :
200 మందికి అమెరికా యాప్ బురిడీ
ఏలూరులో ఆన్‌లైన్ యాప్ ఘరానా మోసం
ఆలస్యంగా వెలుగులోకి ఏఎస్ఓ సైబర్ నేరాలు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ చెల్లింపులని ప్రచారం
రోజులు గడిచినా బ్యాంకులో డిపాజిట్ కాని వైనం
నగదు విత్ డ్రా చేసుకోవడానికి పనిచేయని యాప్
మోసపోయామని లబోదిబోమంటున్న బాధితులు
ఏలూరు, స్వేచ్ఛ : ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో ఏఎస్ఓ పేరిట నిర్వహిస్తున్న ఆన్‌లైన్ యాప్ ఘరానా మోసం వెలుగుచూసింది. ఈ అమెరికా యాప్‌లో రూ. 2 వేలు పెట్టుబడి పెడితే రోజుకు రూ. 80, రూ.6,150 పెట్టుబడితో రోజుకు రూ. 220 ఇస్తామని సైబర్ నేరగాళ్లు నమ్మబలికారు. దీంతో రూ.2వేలు, రూ.6వేలు, రూ.18వేలు, రూ.20వేలు వరకూ జనాలు పెట్టుబడి పెట్టారు. ఎంత ఎక్కువ కడితే రోజుకు అంత ఎక్కువ ప్రతిఫలం వస్తుందని నమ్మించి చివరికి బురిడీ కొట్టించింది యాప్. ఇలా మొత్తం 200 మందిని యాప్ నట్టేటా ముంచింది. మొత్తం రెండు విభాగాల్లో ఒక్కో విభాగం నుంచి 600 మంది సభ్యులు చేరారు. టాస్క్ పూర్తి చేసిన వారికి తొలుత రూ. 750 డిపాజిట్ చేశారు. దీంతో ఆ యాప్‌పై జనాలకు కాస్త నమ్మకం కలిగించారు. ఇలా ద్వారకా తిరుమలతో పాటు రాజమండ్రి, భీమవరం పట్టణ ప్రాంత వాసులు పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టారు. ఇందులో కొందరికి రెండు, మూడు సార్లు జమ అయ్యాయి కూడా. ఆ తర్వాత డబ్బులు ఆ తర్వాత డిపాజిట్ కాకపోవడంతో మోసపోయినట్లు బాధితులు తెలుసుకున్నారు. దీనికి తోడు యాప్ కూడా పనిచేయకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులు, ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ALSO READ : స్పీడ్ పెంచిన చంద్రబాబు.. కేబినేట్ భేటీకి ముహుర్తం ఫిక్స్