Samyuktha Menon : స్వర్గీయ నందమూరి తారకరామారావు(Sr.NTR) వారసుడిగా తనకంటూ ఒక ఇమేజ్ అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తన తల్లి బసవతారకం(Basavatarakam ) పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించారు. ఈ హాస్పిటల్లో వేలాదిమంది క్యాన్సర్ రోగులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తూ.. గొప్ప మనసు చాటుకుంటున్నారు బాలకృష్ణ. ఈ హాస్పిటల్ ద్వారా రోగులకు మంచి వైద్యం అందించడమే కాదు అటు మహిళలకు ఇటు పురుషులకు క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తూ.. ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్ (Samyuktha menon) కనిపించడంతో ప్రేక్షకులందరూ ఒక్కసారిగా ఏమైందంటూ కలవరపాటు చెందారు.
బాలకృష్ణ బసవతారకం హాస్పిటల్ లో మెరిసిన సంయుక్త..
అసలు విషయంలోకి వెళితే.. బాలకృష్ణ తన తల్లి జ్ఞాపకార్థం నిర్మించిన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నేడు రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు హీరోయిన్ సంయుక్త. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో దూసుకెళ్తున్న సంయుక్త , ఇప్పుడు సేవా కార్యక్రమాలలో కూడా పాల్గొంటోంది. ఈ నేపథ్యంలోనే బసవతారకం హాస్పిటల్ లో బాలకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈ అవగాహన కార్యక్రమానికి హాజరవడం ఒక ఎత్తైతే.. ప్రజలలో అవగాహన కల్పించడం మరో ఎత్తు. ఈ రెండు అదృష్టాలు నాకు ఒకేసారి లభించాయి అంటూ తెలిపింది.
రొమ్ము క్యాన్సర్ పై సంయుక్త అవేర్నెస్..
సంయుక్త మాట్లాడుతూ.. బసవతారకం ఆసుపత్రి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ వాకథాన్ లో పాల్గొనడం సంతోషంగా అనిపిస్తోంది. రొమ్ము క్యాన్సర్ పై పోరాటంలో మనమంతా కూడా ముందుకు రావాలి. ఈ ఏడాది రొమ్ము క్యాన్సర్ పై ప్రజలలో అవగాహన తీసుకురావాలి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్ ను డిటెక్టివ్ చేస్తే, చికిత్సతో నయం చేయడానికి మరింత సులభం అవుతుంది. మనమంతా కూడా ఈ అవేర్నెస్ లో భాగమవుదాం అంటూ పిలుపునిచ్చింది సంయుక్త.
టాలీవుడ్ ఎంట్రీ లోనే హ్యాట్రిక్..
సంయుక్త ప్రధానంగా మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటి. అక్కడ తనకంటూ ఒక ఇమేజ్ దక్కించుకున్న తర్వాత తెలుగు, తమిళ్ చిత్రాలలో నటించడం మొదలు పెట్టింది. అలా తొలిసారి 2022లో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), రాణా (Rana)కాంబినేషన్లో వచ్చిన భీమ్లా నాయక్ (Bheemlanayak) సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై, అదే ఏడాది కళ్యాణ్ రామ్ (Kalyan Ram) రీ ఎంట్రీ లో నటించిన బింబిసారా (Bimbisara )సినిమాతో మరో విజయాన్ని తన కైవసం చేసుకుంది. ఆ తర్వాత ధనుష్ (Dhanush) హీరోగా నటించిన బై లింగ్వల్ మూవీ సార్ (Sir) సినిమాలో కూడా నటించి హ్యాట్రిక్ అందుకుంది సంయుక్త. మొదటి ఎంట్రీ తోనే హ్యాట్రిక్ కొట్టడంతో తెలుగులో విపరీతమైన క్రేజ్ లభించింది. అంతేకాదు హీరోయిన్ గా తన అందచందాలతో మెప్పించిన సంయుక్త డెవిల్ పాత్రలో కూడా ఆకట్టుకుంది. సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) హీరోగా నటించిన విరూపాక్ష (Virupaksha) సినిమాలో తన నటనతో అందరిని అబ్బురపరిచింది. ప్రస్తుతం శర్వానంద్ 37 (Sharwanand 37) వ సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్న ఈమె.. మరో రెండు తెలుగు సినిమాలలో కూడా నటిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఒక మళయాల చిత్రంలో కూడా నటిస్తోంది సంయుక్త.