E-Paper
Advertisement

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..
Advertisement

Tirupati laddu: తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్లీ నెయ్యి, జంతువుల కొవ్వు ఉందని నడుస్తున్న వివాదంపై అనూహ్యంగా అమూల్ కంపెనీ స్పందించింది. తిరుమల భగవాన్ బాలాజీ భక్తులకు అందించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని.. ఆ నెయ్యి అమూల్ కంపెనీ పంపిణీ చేసిందని సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.

ఈ విషయంపై అమూల్ డైరీ కంపెనీ స్పందించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను తిరస్కరిస్తూ కంపెనీ ఒక అధికారిక ప్రకటన జారీ చేసింది. ” తిరుమల తిరుపతి దేశస్థానానికి అమూల్ కంపెనీ ఎప్పుడూ నెయ్యి సప్లై చేయలేదు అని మేము స్పష్టంగా చెబుతున్నాం,” అని సోషల్ మీడియాలో అమూల్ అధికారకం ప్రకటన జారీ చేసింది.

Advertisement

Also Read: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

తమ కంపెనీ నెయ్యి ISO సర్టిఫికేషన్ పొందిన ఫ్యాక్టరీలో హై క్వాలిటీ పాల నుంచి తయారు చేయబడుతుందని, చెబుతూ.. ”అముల్ నెయ్యి శుద్ధమైన పాల కొవ్వుత తయారు చేయబడుతుంది. ఈ పాల కొవ్వు నెయ్యి చాలా కఠినంగా క్వాలిటీ చెక్ చేయబడుతుంది. పైగా ఎఫ్ఎస్ఎస్ఏఐ స్టాండర్డ్స్ పాటిస్తూ.. పాల కల్తీ జరగలేదని అన్ని టెస్టుల్లో నిర్ధారణ చేశాకే నెయ్యి తయారు చేసేందుకు ఆ పాలని ఉపయోగిస్తాం. సోషల్ మీడియాలో వస్తున్న టిటిడీకి మేము నెయ్యి సరఫరా చేశామని వార్తలు తప్పుడు సమాచారం. కంపెనీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారానికి ఇదే మా సమాధానం.” అని పోస్ట్ లో రాసింది.

Advertisement

మరోవైపు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణ రెడ్డి.. గుజరాత్ నేషనల్ డైరీ లేబరేటరీ ద్వారా తిరుమల లడ్డూ, అందులో ఉపయోగించిన నెయ్యిని పరీక్షించినట్లు రిపోర్ట్ చూపించారు. ఈ రిపోర్ట్ లో లడ్డూ తయారీ ఉపయోగించిన నెయ్యి లో పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, చేప నూనె ఉన్నట్లు తేలిందని తెలిపారు.

తిరుపల లడ్డూ ప్రసాదంలో కల్తీ వివాదం ఇప్పుడు న్యాయస్థానానికి చేరింది. ఆంధ్ర ప్రదేశ్ హై కోర్టులో వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి ఒక పిటీషన్ వేశారు. సుప్రీం కోర్టులో కూడా ప్రసాదం కల్తీ నెయ్యికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని హిందువులు, భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని శిక్షించాలని పిటీషన్ దాఖలు అయింది.

Also Read:  ఇండియాలో పెళ్లిళ్ల సీజన్ పీక్స్.. కేవలం రెండు నెలల్లో రూ.4.25 లక్షల కోట్ల బిజినెస్

ఇదంతా జరుగుతుండగా.. రాజస్థాన్ ప్రభుత్వం ఈ వివాదం గురించి రాష్ట్రంలోని ప్రముఖ దేవస్థానాల్లో ప్రసాదం క్వాలిటీ చెక్ చేయాలని స్పెషల్ క్యాంపెయిన్ ని లాంచ్ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి 26 వరకు రాజస్థాన్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ శుద్ధ ఆహార్, మిలావట్ పర్ వార్ పేరుతో ఈ కాంపెయిన్ చేయబోతోంది. ఈ క్యాంపెయిన్ లో రాష్ట్రంలోని 14 ప్రధాన దేవాలయాల ప్రసాదాన్ని క్వాలిటీ చెక్ చేస్తారు.

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×