BigTV English

AP Inter Student Incident : తన్మయిని చంపింది వాడే.. ఎందుకు చంపాడంటే.. వీడిన మిస్టరీ..

AP Inter Student Incident : తన్మయిని చంపింది వాడే.. ఎందుకు చంపాడంటే.. వీడిన మిస్టరీ..

AP Inter Student Incident : ఇంటర్ స్టూడెంట్ తన్మయి హత్య. ఏపీలో సంచలనం సృష్టించింది. ఎవరు చంపారో తెలీదు. ఎందుకు చంపారో తెలీదు. దారుణ స్థితిలో డెడ్‌బాడీ దొరకడం కలకలం రేపింది. బీర్ బాటిల్‌తో తలపై కొట్టి చంపేశారు. ఆ తర్వాత శవాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టారు. పోలీసులపైనా విమర్శలు వచ్చాయి. తమ కూతురు మిస్సింగ్ అని చెప్పినా ఖాకీలు పట్టించుకోలేదని తన్మయి పేరెంట్స్ ఆరోపించారు. కేసు పోలీసులకు ఛాలెంజింగ్‌గా మారింది. ఈ దారుణం అనంతపురంలో జరిగినా.. రెండు తెలుగు స్టేట్స్‌ను షేక్ చేసింది. మంత్రి నారా లోకేశ్ సైతం ఘటనపై స్పందించారు. పక్కా విచారణ తర్వాత నిందితుడు ఎవరో తెలిసిపోయింది. పోలీసులు ఇప్పటికే అతన్ని అరెస్ట్ చేశారు.


కేసు విచారణ ఇలా..

తన్మయి కాల్ డేటా, సోషల్ మీడియా పేజెస్‌తో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సీసీఫుటేజ్‌ను బట్టి గత మంగళవారం రాత్రి ఓ యువకుడితో కలిసి బైక్ మీద వెళ్లింది తన్మయి. అప్పటినుంచీ కనిపించలేదు. తల్లిదండ్రులు చాలాచోట్ల వెతికినా లాభం లేకుండా పోయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా వెంటనే పట్టించుకోలేదని ఆరోపించారు పేరెంట్స్. ఆదివారం తన్మయి మృతదేహం మణిపాల్ స్కూల్ వెనకాల కాలిన స్థితిలో కనిపించాక విచారణలో వేగం పెరిగింది.


ఆ ఇద్దరిలో ఒకడే..

మొదట తమకు అనుమానం ఉందంటూ ఓ యువకుడి ఫోన్ నెంబర్ పోలీసులకు ఇచ్చారు పేరెంట్స్. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మంగళవారం నుంచి అతను పోలీస్ కస్టడీలోనే ఉన్నాడు. హత్య చేసింది అతను కాదని తేలింది. ఇంకెవరు? తన్మయి సోషల్ మీడియా ఖాతాలను ట్రేస్ చేశారు. ఓ ఇద్దరితో క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్టు గుర్తించారు. నరేష్, బాల అనే యువకులను అదుపులోకి తీసుకుని గట్టిగా ప్రశ్నిస్తే అసలు నిజం బయటపడింది. నరేషే హంతకుడని తేలింది.

ఇన్‌ష్టాలో ట్రాప్

నరేష్‌కు తన్మయికి ఇన్‌స్టాలో పరిచయం. ఆ తర్వాత ప్రేమగా మారింది. అయితే నరేష్‌కు అంతకుముందే పెళ్లి అయింది. ఆ విషయం దాచేసి తన్మయిని లవ్ పేరుతో ట్రాప్ చేశాడు. అతనికి పెళ్లి అయిందనే మేటర్ తెలీని తన్మయి.. తనను పెళ్లి చేసుకోమని ప్రెజర్ పెట్టింది. దీంతో ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాడు నరేష్.

రాయితో కొట్టి.. బీర్ బాటిల్‌తో పొడిచి..

మంగళవారం నైట్.. బైక్‌పై తీసుకెళ్లి ఒక రహస్య ప్రదేశంలో తన్మయిని దాచిపెట్టాడు. బుధవారం రాత్రి ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడే ఉన్న బండరాయితో తలపై బలంగా కొట్టాడు. అప్పటికీ ప్రాణం పోకపోవడంతో.. అక్కడే ఉన్న బీర్ బాటిల్ పగలగొట్టి.. నోట్లో గుచ్చి.. చంపేసినట్టు పోలీసులు విచారణలో నిందితుడు నరేష్ అంగీకరించాడు. ఈ హత్య నరేష్ ఒక్కడే చేసినట్టు.. ఇందులో మరెవరి హస్తం లేదని ప్రాథమికంగా భావిస్తున్నారు పోలీసులు. పూర్తి వివరాలు ప్రెస్‌మీట్‌లో వెల్లడించనున్నారు.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×