కలలు కనడం సహజం మనిషికి రోజుల్లో రెండు మూడు కలలో వచ్చే అవకాశం ఉంటుంది. మనకు వచ్చే కలలో ఏదో ఒక సూచనను మోసుకొస్తాయి. ఒక వ్యక్తి నిద్రపోయిన తర్వాత అనేక రకాల కలలను చూస్తాడు. వాటిలో కొన్ని జీవితంతో అనుబంధం కలిగినవి కూడా ఉంటాయి. అలాగే ఆ కలలో కొన్ని రకాల సూచనలను కూడా ముందస్తుగా ఇచ్చే అవకాశం ఉంది.
స్వప్న శాస్త్రం ప్రకారం మనసు, భవిష్యత్తు, మన జీవితానికి సంబంధించిన అనేక మర్మమైన విషయాలు కలల ద్వారానే మనము తెలుసుకుంటాము. ఎప్పుడైనా మాజీ లవర్ ని చూసినట్లయితే దానికి అర్థం ఏంటో తెలుసుకోండి. అలాగే కలలో ఎవరైనా ఒక అపరిచిత వ్యక్తికి మీరు మీ ప్రేమను ప్రపోజ్ చేస్తున్నట్టు కల వచ్చినా కూడా దానికి కొన్ని రకాల అర్థాలు ఉన్నాయి.
పాత లవర్ కనిపిస్తే
మీ పాత లవర్ ని గురించి పదేపదే కలలో వస్తుంటే ఆ వ్యక్తి ఇప్పటికీ మీ మనసులో ఉన్నాడని అర్థం చేసుకోవాలి. అతడి వైపే మీ మనసు మొగ్గు చూపుతోందని తెలుసుకోవాలి. మీరు మీ పాత ప్రేమికుడితో ఉన్నా అనుభవాలను మెదడులోంచి తీసివేసినా… మీ మనసులోంచి మాత్రం తీసివేయలేకపోతున్నారు. అవి అట్టడుగు పొరల్లో ఇంకా అలా భద్రంగానే ఉన్నాయి. భావోద్వేగపరంగా అవి మీతో బాగా ముడి పడిపోయాయి. అందుకే అతడు మీ కళ్ళ ముందు కనిపించకపోయినా కలల రూపంలో మిమ్మల్ని వెంటాడుతూనే ఉన్నాడు.
కలలో ఎవరైనా ఒక అపరిచిత వ్యక్తికి మీరు ప్రేమను ప్రపోజ్ చేస్తున్నట్టు లేదా ఆపరిచిత వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నట్టు అనిపిస్తే దానికి కూడా ఒక అర్థం ఉంది. త్వరలో మీ జీవితంలో కొత్త సంబంధాలు, కొత్త అనుభవాలు రాబోతున్నాయి. అలాగే ఆధ్యాత్మిక అనుబంధాల ప్రారంభాన్ని కూడా ఇలాంటి కల సూచిస్తుంది. జీవితంలో కొత్త మనుషుల పరిచయానికి ఇలాంటి కలలే ముందస్తు సంకేతాలు.
శారీరక సంబంధం పెట్టుకున్నట్టు
ఒక వ్యక్తి తన కలలో తన ప్రేమికుడితో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు చూస్తే ఆ కల దేన్ని సూచిస్తుందో తెలుసా… మీకు మీ ప్రేమికుడు పై ఉన్న లైంగిక కోరికను సూచిస్తుంది. అలాగే ఇలాంటి కలలు ఆత్మవిశ్వాసం, శక్తి, సృజనాత్మకత వంటి పెరుగుదలను కూడా సూచిస్తాయి.
ప్రేమలో విఫలం కావడం, బ్రేకప్ చెప్పుకోవడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎప్పుడో ఒకసారి జరుగుతూనే ఉంటుంది. మీ కలలో మీ ప్రేమికుడితో మీరు బ్రేకప్ చెప్పుకొని విడిపోతున్నట్లు కల వస్తే మీరు ఎంతో అభద్రతా భావంతో నిండి ఉన్నారని అర్థం. మీకు సంబంధాలపై నమ్మకం తక్కువగా ఉందని తెలుసుకోవాలి. అలాగే భవిష్యత్తు గురించి కూడా మీరు ఆందోళన ఎక్కువగా చెందుతారు.
స్వప్న శాస్త్రం ఒక పురాతనమైనది. దీన్ని నిజమేనని నమ్మే వారి సంఖ్య అధికంగానే ఉంది. మనుషులకు వచ్చే ప్రతి కల కూడా అతని జీవితంలోని అనేక సంఘటనలతో సంబంధం కలిగి ఉంటుందని స్వప్నశాస్త్రం చెబుతోంది. అలాగే మనిషి లోపలి ఆలోచనలు, కోరికలు, భయాలు వంటివన్నీ కూడా కలల రూపంలోనే బయటపడతాయి.
కలలు పాత విషయాలను గుర్తు చేయడమే కాదు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను కూడా సూచిస్తాయి. కొన్నిసార్లు అప్రమత్తంగా ఉండేలా చేస్తాయి. కలలోనే జీవితంలో ఎన్నో మార్పులు సూచికలుగా కనిపిస్తాయి. అయితే ఒక మనిషి నిద్రపోయిన తర్వాత కలలో ఎప్పుడు మొదలవుతాయనే సందేహం రావచ్చు. మనిషి మత్తు నిద్రలోకి వెళ్ళాక కల రావడం మొదలవుతుంది. అంటే మీరు నిద్రపోయినా ఒక గంట రెండు గంటల తర్వాత కలలు వచ్చే అవకాశం ఉంది. కలలను విశ్లేషించి మన లోపల ఉన్న ఆలోచనల గురించి మనసు గురించి మనం మరింతగా తెలుసుకోవచ్చు.
స్వప్న శాస్త్రం చెబుతున్న ప్రకారం రాత్రి 10 గంటలనుండి 12 గంటల మధ్య వచ్చే కొన్ని కలలు పగటిపూట మీరు ఎలాంటి పనులు చేశారో దాదాపు వాటికి సంబంధించినవే వస్తాయి. ఇక బ్రహ్మ ముహూర్తంలో వచ్చిన కలలకు ఎంతో విలువ ఉంది. ఆ కలలో నెరవేరడానికి ఒక నెల నుంచి ఆరు నెలల సమయం పడుతుందని అంటారు. ఇక రాత్రి 12 గంటల నుండి ఉదయం 3 గంటల వరకు వచ్చే కలలో నిజమయ్యే అవకాశం ఎక్కువ ఉందని కూడా నమ్ముతారు.