BigTV English

Global Investors Summit : అతిథులకు ఆంధ్రా రుచులు.. నోరూరించే వంటకాలు..

Global Investors Summit : అతిథులకు ఆంధ్రా రుచులు.. నోరూరించే వంటకాలు..

Global Investors Summit : విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు దేశ, విదేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడుదారులు వస్తున్నారు. వీరికి ఆతిథ్యం అదిరిపోయేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పసందైన విందు భోజనాలు సిద్ధం చేస్తోంది. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలోని పాపులర్ వంటకాలను అతిథులకు వడ్డించనున్నారు.


తొలిరోజు ఆంధ్రా రుచులు..
ఏపీ చేపల, రొయ్యల ఉత్పత్తిలో టాప్ లో ఉంది. మరి గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కు వచ్చిన అతిథులకు ఆ వంటకాల రుచులు చూపించనున్నారు. అందుకే బొమ్మిడాయిల పులుసు,రొయ్యల మసాలా లాంటి కూరలను సిద్ధం చేస్తున్నారు. అలాగే గుంటూరు కోడి కూర వేపుడు, మటన్‌ కర్రీ, చికెన్‌ పలావ్ అతిథులకు వడ్డిస్తారు. మష్రూం, క్యాప్సికం కూర, ఆలూ గార్లిక్‌ ఫ్రై, కేబేజీ మటర్‌ ఫ్రై, వెజ్‌ పలావ్, రోటీ, కుల్చా, పన్నీర్‌ బటర్‌ మసాలా, మెంతికూర–కార్న్‌ రైస్, మిర్చి కా సలాన్, టమాటా పప్పు, బీట్‌రూట్‌ రసం, మజ్జిగ పులుసు, గోభీ ఆవకాయ, నెయ్యి, వడియాలు, ద్రాక్ష పచ్చడి, చల్ల మిర్చి , జున్ను రుచులను అతిథులు ఆస్వాదించనున్నారు.

రెండో రోజూ విందు ఇలా..
శనివారం ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, వడ, టమా­టా బాత్, హాట్‌ పొంగల్ ఉంటాయి. ఉదయం స్నాక్ లో ప్లమ్‌ కేక్, డ్రై కేక్, వెజ్‌ బుల్లెట్, మఫిన్స్, స్ప్రింగ్‌ రోల్స్ అందిస్తారు. సాయంత్రం స్నాక్స్‌లో కుకీస్, చీజ్‌ బాల్స్, డ్రై ఫ్రూట్‌ కేక్, ఫ్రూట్‌ కేక్, కట్‌ మిర్చి బజ్జీలు, టీ, కాఫీ అందుబాటులో ఉంటాయి.


రెండో రోజు లంచ్‌లో రష్యన్‌ సలాడ్స్, వెజ్‌ సలాడ్‌, రుమాలి రోటీ, బటర్‌ నాన్‌ ఇస్తారు. ఆంధ్రా చికెన్‌ కర్రీ, చేప ఫ్రై, రొయ్యల కూర, ఎగ్‌ మసాలా, మటన్‌ పలావ్‌ ఇలా చాలా రకాలు నాన్ వెజ్ ఐటమ్స్ అతిథులకు వడ్డిస్తారు. వెజ్‌ బిర్యానీ, కరివేపాకు రైస్, కడాయ్‌ పన్నీరు కూర, క్యారెట్‌ బీన్స్‌ కొబ్బరి ఫ్రై, వంకాయ మెంతి కారం, బెండకాయ–జీడిపప్పు ఫ్రై, పప్పుచారు, మిరియాల రసం, మజ్జిగ పులుసు, ఉలవచారు లాంటి వెజ్ వంటకాలు అందుబాటులో ఉంటాయి. అలాగే కట్‌ ఫ్రూట్స్, ఐస్‌క్రీం, గులాబ్‌జామ్, డబుల్‌కా మీఠా అతిధులు ఆస్వాదించనున్నారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×